రతన్ టాటా పెంపుడు శునకం శోకం... "గోవా" అనే పేరెందుకు పెట్టారంటే..?

పారిశ్రామికవేత్త, పరోపకారి, డాగ్ లవ్వర్ రతన్ టాటా (86) ముంబైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-11 00:30 GMT

పారిశ్రామికవేత్త, పరోపకారి, డాగ్ లవ్వర్ రతన్ టాటా (86) ముంబైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలను మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించింది. గురువారం సంతాప దినంగా ప్రకటించింది. ఆ సంగతి అలా ఉంటే... రతన్ టాటా అంత్యక్రియల వద్ద ఆయన పెంపుడు శునకం కనిపించడం అందరినీ మరింత కలిచివేసిందనే చెప్పాలి!

అవును... రతన్ టాటాకు శునకాలపట్ల ప్రగాఢమైన కరున ఉన్న సంగతి తెలిసిందే. మూగజీవాల సంక్షేమం కోసం ఆయన ప్రత్యేకంగా పాటుపడేవారు. ముఖ్యంగా వర్షాకాలం కార్ల కింద ఆశ్రయం పొందే వీధికుక్కలు, పిల్లుల విషయంలో కారు యజమానులను, డ్రైవర్లను ఆయన నిత్యం అలర్ట్ చేసేవారు! ఆయన ఆయన పెంపుడు శునకం "గోవా" గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

తాజాగా రతన్ టాటా అంత్యక్రియల సమయంలో అతని పెంపుడు శునకం "గోవా" చివరిసారిగా నివాళులర్పించడానికి వచ్చింది. ఈ సమయంలో ఆయన భౌతికకాయం వద్ద దీనంగా విలపిస్తూ కనిపించింది. తనను ఒంటరిని చేసి వెళ్లిపోయారని అనుకుంటుందో ఏమో తెలియదు కానీ.. భౌతికకాయం వద్ద కూర్చుని దీనంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

శునకానికి "గోవా" అనే పేరెందుకు పెట్టారు?:

రతన్ టాటా తన పెంపుడు శునకానికి "గోవా" అని పేరు పెట్టారు. ఆ పేరే పెట్టడం వెనుక ఓ కథ ఉందని చెబుతుంటారు. ఓసారి రతన్ టాటా గోవాలో ఉన్నప్పుడు ఒక వీధి కుక్క అతనితో పాటు రావడం ప్రారంభించింది. ఆ సమయంలో దాన్ని దత్తత తీసుకుని ముంబైకి తీసుకురావాలని రతన్ జీ నిర్ణయించుకున్నారు.

ఈ సమయంలో ఆ శునకానికి "గోవా" అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా స్పందించిన దాని కేర్ టేకర్... గోవా తమతో సుమారు 11 ఏళ్లుగా ఉంతుందని.. గోవాకు విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడ నుంచి ఈ కుక్కను తీసుకొచ్చారని.. రతన్ టాటాను ఆ శునకం చాలా ఇష్టపడేదని తెలిపారు.

Full View
Tags:    

Similar News