బాలీవుడ్, బిగ్ బీ తో రతన్ టాటా కు ఉన్న సంబంధం తెలుసా?

అవును... అని వ్యాపారాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న రతన్ టాటా... బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనూ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా... 2004లో ఓ బాలీవుడ్ చిత్రానికి సహ-నిర్మాతగానూ వ్యవహరించారు.

Update: 2024-10-10 08:21 GMT

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అక్టోబర్ 9 - 2024న 86 ఏళ్ల వయసులో మరణించారు. టాటా గ్రూపుకు ప్రపంచ వ్యాప్తంగా ఓ అద్భుతమైన, గౌరవనీయమైన సమ్మేళనంగా మార్చారు. సాల్ట్ నుంచి స్టీల్ వరకూ అన్ని వ్యాపారాల్లోనూ ఉన్న రతన్ టాటా.. బాలీవుడ్ లోనూ ప్రవేశించారు. ఆయన ఓ బాలీవుడ్ చిత్రానికి సహ-నిర్మాతగా వ్యవహరించారు.

అవును... అని వ్యాపారాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న రతన్ టాటా... బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనూ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా... 2004లో ఓ బాలీవుడ్ చిత్రానికి సహ-నిర్మాతగానూ వ్యవహరించారు. విక్రం భట్ దర్శకత్వం వహించిన ఆ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ లో అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహాం, బిపాసా బసు వంటి అగ్రతారలు నటించారు.

ఆ సినిమా పేరు "ఏత్ బార్". ఈ చిత్రాన్ని జతిన్ కుమార్ తో కలిసి రతన్ టాటా నిర్మించారు. ఈ సినిమాలో కుమర్తె పట్ల అంకితభావంతో ఉన్న తండ్రి పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు. డా. రణ్ వీర్ మల్హోత్రా అనే ఈ పాత్ర చుట్టూ కథ కేంద్రీకృతమైం ఉంటుంది. ఈ సినిమాలో అబ్సెసివ్ ప్రేమికుడిగా ఆర్యన్ త్రివేదీ పాత్రలో జాన్ అబ్రహాం నటించారు.

ఈ సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదనే చెప్పాలి. రూ.9.50 కోట్లతో ఈ సినిమాను నిర్మించగా.. కేవలం రూ.7.96 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇది రతన్ టాటా నిర్మించిన ఏకైన చిత్రంగా మిగిలిపోయింది. ఆ విధంగా బాలీవుడ్ తోనూ, అమితాబ్ తోనూ రతన్ టాటా ఓ జ్ఞాపకాన్ని కలిగి ఉన్నారు!

కాగా... అక్టోబర్ 9 - బుధవారం రాత్రి రతన్ టాటా కన్నుమూశారు. అకస్మాత్తుగా బీపీ తగ్గడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు.

Tags:    

Similar News