లీటరు ఎలుక పాలు అన్ని లక్షల రూపాయిలా? ఇంతకూ దేనికి వాడతారు?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాలుగా ఎలుక పాలు చెబుతున్నారు. ఎలుక పాలు సంపాదించటం అంత తేలికైన విషయం కాదంటున్నారు

Update: 2023-10-06 17:30 GMT

అత్యంత ఖరీదైన పాలు అంటే.. గాడిద పాలుగా చెబుతుంటారు. కానీ.. చూసినంతనే చంపే వరకు నిద్ర పోలేనంత ఇరిగేట్ చేసే ఎలుకల పాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాలు అన్న విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కీలకమైన పరిశోధనలకు వినియోగించే ఈ పాలకు సంబంధించి వివరాలు చదివినకొద్దీ ఆశ్చర్యాన్ని కలిగించకమానవు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాలుగా ఎలుక పాలు చెబుతున్నారు. ఎలుక పాలు సంపాదించటం అంత తేలికైన విషయం కాదంటున్నారు. అంతేకాదు.. ఒక లీటరు ఎలుక పాల కోసం ఏకంగా 40 వేల ఎలుకలు అవసరమని చెబుతున్నారు. ఇంతకూ లీటరు ఎలుక పాలు మన రూపాయిల్లో అక్షరాల రూ.18 లక్షలుగా చెబుతున్నారు. ఇంతకూ ఎలుక పాలను దేనికోసం వాడతారు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే వచ్చే సమాచారం మరింత విస్మయానికి గురి చేస్తుంది.

మలేరియా బ్యాక్టీరియాను నిర్మూలించేందుకు తయారు చేసే ఔషధాల తయారీలో ఎలుక పాలను వినియోగిస్తారు. ఆవు పాలకు బదులుగా ఎలుక పాలను వినియోగించటానికి కారణం.. ఎలుక డీఎన్ఏ ఇతర జంతువుల డీఎన్ఏ కంటే ప్రభావవంతంగా ఉండటమే. పైగా మానవ శరీరానికి ఈ పాలు సూట్ అవుతాయంటున్నారు. అంతేకాదు.. మానవ శరీరానికి సంబంధించిన ఫలితాల్ని విశ్లేషించటంచాలా తేలికగా చెబుతున్నారు.

ఈ కారణంతో ఔషధ ప్రయోగాలకు మిగిలిన జంతువుల పాల కంటే కూడా ఎలుక పాలు శ్రేష్ఠమైనవని చెబుతున్నారు. అంతేకాదు.. ప్రయోగాల కోసం వేలాది జంతువుల అవసరం ఉంటుంది. ఆవులు లాంటివి వాటిని వేలాదిగా సేకరించటం.. ప్రయోగాలకు అనువుగా వినియోగించుకోవటం కష్టం అవుతుంది. అందుకు భిన్నంగా ఎలుకలు అయితే చాలా సులువు. అందుకే.. ఎలుకల్ని ప్రయోగాలకు వినియోగిస్తుంటారు.

జంతువులలో ఏడాది వ్యవధిలో ఎన్ని లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తారన్న విషయంలోకి వెళితే.. ఆవు ఏడాదిలో 10వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తే.. మేకలు వాటి బరువు కంటే 12 రెట్ల ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తాయి. ఒక అంచనా ప్రకారం మిగిలిన అన్ని జీవుల్లోనూ బ్లూ వేల్ (నీలి తిమింగలం) రోజుకు 600 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ పాలు చాలా కొవ్వును కలిగి ఉంటాయి. పిల్ల తిమింగలం రోజుకు 100 కేజీల చొప్పున బరువు పెరగటం గమనార్హం.

Tags:    

Similar News