డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం కేసులో బిగ్ ట్విస్ట్!

అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం... రౌత్ గోల్ఫ్ కోర్స్ వెలుపల 12 గంటలకు పైగా ట్రంప్ కోసం కాసుకుని ఉన్నాడని అధికారులు చెబుతున్నారు.

Update: 2024-10-01 13:25 GMT

సెప్టెంబర్ నెలలో ఫ్లోరిడా గోల్ఫ్ కోర్సులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు ర్యాన్ వెస్లీ రౌత్ (58) అనే వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం... రౌత్ గోల్ఫ్ కోర్స్ వెలుపల 12 గంటలకు పైగా ట్రంప్ కోసం కాసుకుని ఉన్నాడని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది.

అవును... గోల్ఫ్ కోర్స్ లో ట్రంప్ ను హత్య చేసేందుకు ర్యాన్ వెస్లీ రౌత్ 12 గంటలకు పైగా వేది చూశాడని.. ఆ సమయంలో అతనిని సీక్రెట్ సర్వీస్ రైఫిల్ తో గుర్తించిందని అధికారులు తెలిపారు. ఈ సమయంలో వాదనలు వినిపించిన ప్రాసిక్యూటర్లు... సుమారు నెల పాటు ఫ్లోరిడాలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ను రౌత్ వెంబడించాడని అన్నారు.

అతడు.. హత్యాయత్నం, తుపాకీని కలిగి ఉండటం, అధికారిపై దాడి చేయడంతో సహా ఐదు ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఆ సమయంలో బుల్లెట్ ప్రూఫ్ ఫ్లేట్లతో ప్యాక్ చేయబడిన రెండు బ్యాగుల మధ్య సోవియట్ రూపొందించిన రైఫిల్ తో రౌత్ ఆయుధాలు కలిగి ఉన్నాడని ప్రాసిక్యూటర్లు న్యాయస్థానానికి తెలిపారు.

ఈ సందర్భంగా తాజాగా కోర్టుకు హాజరైన రైతు... చేతికి సంకెళ్లు, జైలు జంప్ సూట్ తో పాటు అద్దాలు ధరించి వచ్చాడు. ఈ సమయంలో... రౌత్ అరెస్ట్ తర్వాత ముందుకు వచ్చిన సాక్షితో అతను ఆరోపణన్లు ఎదుర్కొంటున్న లేఖను ప్రస్థావించారు. ట్రంప్ విషయంలో తాను ఫెయిల్ అయ్యాయని.. ఈ పని పూర్తిచేయగల వారికి 1,50,000 డాలర్లు ఇస్తానని పేర్కొన్నాడని తెలిపారు!

ఈ సందర్భంగా కోర్టులో రౌత్ తన వెర్షన్ వినిపించాడు. ఇందులో భాగంగా... డొనాల్డ్ ట్రంప్ పై తాను హత్యాయత్నానికి పాలడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఫెడరల్ ఆరోపణలకు తాను నిర్దోషిని అని అంటూ నేరాన్ని అంగీకరించలేదు. దీంతో.. ఈ కేసులో దీన్ని బిగ్ ట్విస్ట్ గా అభివర్ణిస్తున్నారు!

గతంలో ట్రంప్ రహస్య పత్రాల కేసుని నిర్వహించడంలో పాల్గొన్న యూఎస్ జిల్లా జడ్జ్ ఐలీన్ కానన్ ఈ కేసునూ పర్యవేక్షిస్తున్నారు! ఈ సందర్భంగా తాజాగా జరిగిన సంక్షిప్త విచారణ తర్వాత స్పందించడానికి రౌత్ న్యాయవాదులు నిరాకరించారు.

Tags:    

Similar News