రియల్ క్రైమ్ స్టోరీ... బొమ్మ పడిందని ఆమెను చంపేశాడు!

వివరాళ్లోకి వెళ్తే... ఓ యువతి (18) నైట్ క్లబ్ లో తన స్నేహితులతో పార్టీ ముగించుకుని బస్సులో ఇంటికి వెళ్తోంది.

Update: 2025-01-15 12:15 GMT

అత్యంత దారుణమైన ఘటన తెరపైకి వచ్చింది. తన ఫ్లాట్ కి వచ్చిన యువతిని చంపాలా.. ప్రాణాలతో వదిలేయాలా అనే నిర్ణయానికి రావడానికి ఓ మృగాడు క్వాయిన్ ని బొమ్మ - బొరుసు వేశాడు. ఇందులో భాగంగా... బొమ్మ పడితే ఆమె చంపేయాలని అనుకున్నాడు. బొరుసు పడితే ఆమెను ప్రాణాలతో వదిలేయాని నిర్ణయించుకున్నాడు.

అవును... పోలిష్ నగరం కటోవిస్ లో తనకు పరిచయం అయ్యి, తన ఫ్లాట్ కు వచ్చిన ఓ యువతి నిద్రిస్తున్న సమయంలో.. ఆమెను చంపాలా వద్దా అని నిర్ణయించడానికి బొమ్మ - బొరుసు వేసిన వ్యక్తి వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది. "ది డైస్ మ్యాన్" పుస్తకం తరహాలో 20 ఏళ్ల కిల్లర్ ఇలా ఎంపిక చేయడం వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... ఓ యువతి (18) నైట్ క్లబ్ లో తన స్నేహితులతో పార్టీ ముగించుకుని బస్సులో ఇంటికి వెళ్తోంది. సరిగా అదే సమయంలో కారు రిపేర్ షాపులో తన షిఫ్ట్ ముగించుకున్న మాటెస్ట్ హెపా (20) ఆమెను పలకరించాడు. ఈ సమయంలో చూపు చూపు కలిసిందో ఏమో కానీ వెంటనే మాటా మాటా కలిసింది.

అప్పటికే సమయం అర్ధరాత్రి కావడంతో.. కావాలంటే ఈ రాత్రికి తన ఫ్లాట్ లో ఉండి, మార్నింగ్ వెళ్లొచ్చని ఆమెతో చెప్పాడు. దీంతో... అతడి మాటలు నమ్మిన ఆ యువతి అతని వెంట వెళ్లింది. కట్ చేస్తె... కొన్ని రోజుల తర్వాత ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో ఆమె శవం కనిపించింది. గట్టిగా కొట్టి, తాడుతో ఉరివేసి చంపినట్లుగా ఆ మృతదేహం కనిపించింది!

ఈ సమయంలో... మిస్సింగ్ కేసుల జాబితాలోని ఫిర్యాదులతో ఆమె మృతదేహాన్ని పోల్చుకున్నారు. ఒక క్లారిటీకి వచ్చిన అనంతరం ఆమె బంధువులకు సమాచారం అందించారు. ఈ సమయంలో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఆమె కనిపించకుండా పోయిన రాత్రి చివరిసారిగా ఎవరిని కలిసింది అనే కోణంలో విచారించి.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం అతడిని ఈ నెల 8వ తేదీన కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ సమయంలో.. న్యాయమూర్తి ముందు తాను చేసిన నేరం అంగీకరించిన కిల్లర్.. అసలు ఆ రాత్రి ఏమి జరిగింది.. ఎలా జరిగింది అనే విషయాలను వివరించాడు.

ఇందులో భాగంగా... తమ పరిచయం బస్సులో జరిగిందని.. కాసేపు ఇద్దరి మాటలూ కలిసిన తర్వాత.. ఇంటికి వెళ్లిపోతావా.. లేక, నాతో వస్తావా అని అడిగితే ఆమె తనతో రావడానికి ఇష్టపడిందని.. ఆ సమయంలో ఇంటికి చేరిన ఇద్దరం ఏమీ మాట్లాడుకోకుండా ఎదురెదురుగా కూర్చున్నామని అతడు తెలిపాడు.

కాసేపటి తర్వాత ఆమె నిద్రలోకి జారుకుందని.. ఆ సమయంలో ఏమి చేయాలో తనకు తోచలేదని.. అనంతరం ఆమెను నిద్ర లేపడానికి ప్రయత్నించినా ఆమె లేవలేదని తెలిపాడు. ఆ సమయంలో.. తన చేతిలో ఉన్న కాయిన్ ను పైకి ఎగరేసి.. బొమ్మ పడితే చంపేయాలని.. బొరుసు పడితే ప్రాణాలతో వదిలేయాలని అనుకున్నట్లు తెలిపాడు.

ఆ సమయంలో తనకు అలా ఎందుకు అనిపించిందో తెలియదని.. కాకపోతే.. తనకు నిర్ణయాలు తీసుకోవడం కష్టమైనప్పుడల్లా అలా కాయిన్ ఎగరేసి నిర్ణయాలు తీసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు అదే చేసినట్లు చెప్పుకొచ్చాడు. అయితే.. ఆ కాయిన్ బొమ్మ పడిందని.. దీంతో ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

ఈ సమయంలో రక్తం చుక్క పడకుండా ఆమెను చంపాలనుకుని అలాగే చేసినట్లు చెప్పిన కిల్లర్... బొమ్మ పడిన వెంటనే ఆమె ఛాతీపై కూర్చుని, నైలాన్ తాడును ఆమె పీకకు వేసి నలిపేయడం ప్రారంభించినట్లు చెప్పాడు. దీంతో.. ఆమె ఊపిరాడక ప్రాణం విడిచిందని చెప్పుకొచ్చాడు. ఆమె చనిపోయిన తర్వాత మరో ఆలోచన చేసినట్లు తెలిపాడు.

ఇందులో భాగంగా... చనిపోయిన ఆమె ఒంటిపై ఉన్న దుస్తులు అన్ని తొలగించి, ఆమెను శారీరకంగా అనుభవించి, ఆపై మళ్లీ దుస్తులు తొడిగి, ఆమె మృతదేహాన్ని ఓ బ్యాగ్ లో పెట్టి పార్శిల్ చేసినట్లు తెలిపాడు. ఈ సమయంలో దాన్ని ఓ దుప్పట్లో చుట్టి, తగులబెట్టేయాలని అనుకున్నా.. ఎందుకనో అలా చేయలేకపోయినట్లు చెప్పాడు.

అందుకే రాత్రికి రాత్రి ఆమె మృతదేహాన్ని బయట పారేసి వచ్చినట్లు తెలిపాడు. ఇలా ఆమెను చంపేసిన తర్వాత ఎందుకనో హాయిగా అనిపించిందని.. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా.. వెంటనే నిర్ణయం మార్చుకున్నానని చెబుతూ జడ్జి ముందు నేరాన్ని అంగీకరించాడు సదరు యువకుడు.

దీంతో.. కేసు విచారణను ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేశారు జడ్జి. ఆరోజు అతడికి శిక్ష ఖరారు చేస్తారని చెబుతున్నారు. ఇందులో భాగంగా... అతడికి జీవిత ఖైదు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. 2023లో జరిగిన ఈ ఘటనలో నిందితుడు మాటెస్ట్ హెపా కాగా.. బాధితురాలు విక్టోరియా కోజీ ఎలెస్కా!

Tags:    

Similar News