రికార్డ్ దిశగా యూఎస్ వెళ్లే భారతీయుల సంఖ్య.. ఎన్ని లక్షలో తెలుసా?

ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే గత ఏడాదిలో నమోదైన 17.6 లక్షల రికార్డ్ బ్రేక్ అవ్వడం ఖాయమని అంటున్నారు.

Update: 2024-09-27 09:30 GMT

ఈ ఏడాది రికార్డు స్థాయిలో భారతీయులు అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకూ ఈ ఎనిమిది నెలల్లోనే సుమారు 15.5 లక్షల మంది భారతియూలు యూఎస్ చేరుకున్నారు. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే గత ఏడాదిలో నమోదైన 17.6 లక్షల రికార్డ్ బ్రేక్ అవ్వడం ఖాయమని అంటున్నారు.

అవును... అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య ఈ ఏడాది సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు. సెప్టెంబర్ లో విద్యార్థి సీజన్ ముగిసే సమయానికి.. గత సంవత్సరం గణాకాలు సరిపోలవచ్చని.. ఈ ఇయర్ ఎండింగ్ కి మాత్రం కొత్త నెంబర్ నమోదవ్వొచ్చని అంటున్నారు.

అమెరికాలో ఉన్న 51 లక్షల మంది బలమైన భారతీయ ప్రవాసులు ఉండటంతో.. ఇక్కడ నుంచి పెద్ద సంఖ్యలో సందర్శించేందుకు స్నేహితులు, బంధువులు ప్రయాణిస్తారు. ఈ నేపథ్యంలో... జనవరి-ఆగస్టు 2024లో అమెరికా వచ్చే అంతర్జాతీయ సందర్శకుల రెండో అతిపెద్ద ఓవర్సీస్ స్టోర్ మార్కెట్ గా భారత్ అవతరించింది.

ఈ సందర్భంగా స్పందించిన ఢిల్లీలోని యూఎస్ ఎంబసీలోని వాణిజ్య వ్యవహారాల మంత్రి సలహాదారు జోనాథన్ ఎం హీమర్ ఈ వివరాలు వెళ్లడించారు. యూఎస్ తో భూసరిహద్దును పంచుకునే కెనడా, మెక్సికో అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ సందర్శకులను యూఎస్ కు పంపుతున్నట్లు తెలిపారు.

ఇలా భూసరిహద్దు పంచుకునే దేశాలు కాకుండా... 2023లో యూకే, జర్మనీల తర్వాత అధిక సంఖ్యలో అంతర్జాతీయ సందర్శకులను యూఎస్ కు పంపుతున్న మూడో అతిపెద్ద ఓవర్సీస్ సోర్స్ కంట్రీగా భారత్ ఉంది. వాస్తవానికి 2019లో ఈ విషయంలో భారత్ 10వ అతిపెద్ద సోర్స్ మార్కెట్ గా ఉండేది.

ఈ వ్యవహారంపై స్పందించిన నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ డైరెక్టర్ బ్రియాన్ బీల్ మాట్లాడుతూ... 2027 నాటికి ఏటా 280 బిలియన్ డాలర్లు ఖర్చు చేసే 9 కోట్ల మంది సందర్శకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News