'క్రికెట్ కాదు, ఫుట్ బాల్ ఆడుతున్నా'... రేవంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్!

అవును... మీడియాతో చిట్ చాట్ లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా పలు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

Update: 2024-10-30 03:48 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో భాగంగా పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ, ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా కాలేశ్వరం నుంచు మూసీ ప్రాజెక్ట్ వరకూ.. నాటి ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికీ ఉన్న తేడాను చెప్పే ప్రయత్నం చేశారు! ఇదే సమయంలో మూసి ప్రక్షాళన ఆవశ్యకతను వివరించారు.

అవును... మీడియాతో చిట్ చాట్ లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా పలు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సమయంలో రేవంత్ చిట్ చాట్ లో ని కీలక అంశాలు ఒక్కొక్కటీ చూద్దామ్!

* మూసీని ఇలాగే వదిలేస్తే ఏమీ మిగలదు.. హైదరాబాద్ పరిస్థితి దయనీయంగా మారుతుంది. 55 కి.మీ. మూసీ పునరుజ్జీవం పూర్తైతే అద్భుత నగరంగా మారుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు దక్షిణ కొరియాలోని సియోల్ నగరాలకు దీటుగా తయారవుతుంది.

* నేను 80 వేల పుస్తకాలు చదవలేదు.. కాళేశ్వరంలో అన్నీ మీరే చెప్పి చెయించినట్లుగా.. నాకు అంత అనుభవం, పరిజ్ఞానం లేవు. అందుకే.. అంతర్జాతీయంగా అనుభవం ఉన్న సంస్థలతో కన్సార్షియం ఏర్పాటు చేసి కాన్సెప్ట్ తయారు చేయిస్తున్నాను.

* మూసీలో మొదట బాపూఘాట్ నుంచి ఎగువకు 21 కి.మీ. మేర ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తాం. నేను ఏదైనా ప్రారంభించే ముందు వెయ్యిసార్లు ఆలోచిస్తాను.. అందరి అభిప్రాయాలు విని మొదలుపెట్టాక ఆపబోను.

* కేసీఆర్ ని గద్దె దింపి, ముఖ్యమంత్రి కావాలనుకున్నాను.. అయ్యాను. ఇంతకంటే నాకు కవాల్సింది ఏమీ లేదు.. నా పూర్తి సమయాన్ని, శక్తిసామర్ధ్యాలను రాష్ట్రాభివృద్ధికి వినియోగించడం తప్ప. నేను ప్రస్తుతం మూసీ కాన్సెప్ట్ తయారీలో నిమగ్నమై ఉన్నాను.

* మూసీ పునరుజ్జీవ డీపీఆర్ ను అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఐదు కన్సల్టెన్సీ సంస్థల కన్సార్షియం రూపొందిస్తోంది. ఈ పనికి రూ.141 కోట్లతో అప్పగించాం. మూసీ పునరుజ్జీవం పూర్తైతే నైట్ బజార్లు తెరుచుకుంటాయి.. ఆర్థికంగా ఇవన్నీ కొత్త కేంద్రాలుగా మారతాయి.

* మల్లన్న సాగర్ లో 50 వేల ఎకరాల భూమి పోయింది.. 14 గ్రామాల ప్రజలు నిర్వాసితులయ్యారు. కానీ.. మూసీ పునరుజ్జీవం కోసం తీసుకుంటుంది మూసీ భూమే. కాలేశ్వరం కోసం ఇప్పటివరకూ రూ.1.02 లక్షల కోట్లు ఖర్చు చేశారు. అయినా ఆ ప్రాజెక్ట్ కూలిపోయింది.

* మేము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో భూములు, ఓ.ఆర్.ఆర్. వంటివి అమ్మేయలేదు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు, వడ్డీలు కడుతూనే రుణమాఫీతో పాటు ఇతర సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నాం. గృహలక్ష్మీ, మహిళలకు ఉచిత బస్సు వంటివి అమలుచేస్తున్నాం.

* నేను ఫుట్ బాల్ ఆటగాడిని. క్రికెట్ లాగా ఇద్దరు యక్టివ్ గా ఉంటే ఫుట్ బాల్ లో సరిపోదు. అందరూ చురుగ్గా ఆడాలి. ఫుట్ బాల్ లో మ్యాపింగ్ చేస్తారు. నేను క్రికెట్ కాదు, ఫుట్ బాల్ ఆడుతున్నాను.

* దీపావళి అంటే చిచ్చుబుడ్లు అని తెలుసు కానీ.. జన్వాడ ఫాం హౌస్ లో సారా బుడ్లు బయటపడ్డాయి. పోలీసులకు సమాచారం వస్తే వెళ్లారు కానీ.. కేసినో, విదేశీ మద్యం, నాన్ డ్యూటీ మద్యంతోనా దీపావళి?

Tags:    

Similar News