వైల్డ్ ఫైర్స్... రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్!
ఈ నేపథ్యంలో శనివారం నుంచి సోషల్ మీడియా వేదికగా... "వైల్డ్ ఫైర్స్" అనే ఆసక్తికర చర్చ మొదలైంది.
"పుష్ప-2" బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన ఎంత చర్చనీయాంశం అయ్యిందనే సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు సుమారు 16 రోజులుగా ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నుంచి సోషల్ మీడియా వేదికగా... "వైల్డ్ ఫైర్స్" అనే ఆసక్తికర చర్చ మొదలైంది.
అవును... శనివారం తెలంగాణ అసెంబ్లీలో అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. సంధ్య థియేటర్ ఘటనపై ప్రభుత్వం నుంచి క్లారిటీ అడగడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిందని అంటున్నారు. ఈ సందర్భంగా మైకందుకున్న రేవంత్ చేసిన వ్యాఖ్యలు... ఈ విషయాన్ని తెలంగాణ అత్యంత సీరియస్ గా తీసుకుందనే విషయాన్ని స్పష్టం చేసిందని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పినా 4న రాత్రి 9-9:30 గంటల ప్రాంతంలో హీరో థియేటర్ కి వచ్చారని.. సినిమా చూసి వెళ్లిపోతే ఇంత ఇబ్బంది ఉండేది కాదేమోనని.. కానీ క్రాస్ రోడ్స్ నుంచి చేయి ఊపుకుంటూ రోడ్ షోగా వెళ్లడంతోనే ఈ దారుణం చోటు చేసుకుందని రేవంత్ తెలిపారు.
హీరోని థియేటర్ లోపలికి తీసుకెళ్లే క్రమంలోనే అభిమానులు 50 - 60 మంది బౌన్సర్లు అడ్డదిడ్డంగా తోసేయడంతోనే తొక్కిసలాట జరిగిందని.. అలా హీరో లోపలికి వెళ్లిన తర్వాత పోలీసులు గుంపును క్లియర్ చేస్తే.. తల్లీకొడుకు అక్కడ పడి ఉన్నారని.. అంత తొక్కిసలాటలోనే ఆ తల్లి తన కుమారుడిని జాగ్రత్తగా కాపాడుకున్నట్లు వీడియోలో చూశామని తెలిపారు.
అనంతరం... తల్లి చనిపోవడంతోపాటు కుమారుడు కోమాలో ఉన్న విషయాన్ని క్లియర్ చెప్పినా కూడా.. హీరో మాత్రం సినిమా పూర్తయ్యే వరకూ వెళ్లబోనని చెప్పరని.. దీంతో... సీరియస్ అయిన డీసీపీ.. మీరు వెళ్లకపోతే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సి వస్తుందని స్పష్ట్తం చేశారని.. దీంతో రాత్రి 12 గంటల సమయంలో కూడా మళ్లీ రోడ్ షో చేశారని అన్నారు.
ఈ అరోపణలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. అల్లు అర్జున్ ఇంత దారుణంగా ప్రవర్తించారా.. మనిషి ప్రాణాలంటే ఆయనకు విలువలేదా.. ఇంత బాధ్యతారాహిత్యమా.. ఎంత రీల్ హీరో అయినా రియలిస్టిక్ గా ఆలోచించరా..? అంటూ సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ చర్చ మొదలైందని అంటున్నారు.
ఈ సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి! రేవంత్ చెప్పిన విషయాలు ఒక్కొక్కటీ ఒక్కో సంచలనంగా మారిన నేపథ్యంలో... ఈ విషయంపై తెలంగాణ సర్కార్ అత్యంత సీరియస్ గా ఉందని.. ఈ విషయంలో "తగ్గేదే లే" అన్నట్లుగా ముందుకు వెళ్లే అవకాశాలున్నట్లున్నాయంటూ చర్చ నడుస్తుందని అంటున్నారు!!
మరోపక్క... అసెంబ్లీ లో సీఎం, అక్బరుద్ధీన్ చేసిన వ్యాఖ్యల అనంతరం రాత్రి అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చారు. లీగల్ సమస్యల కారణంగా మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేను కానీ.. తాను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్తానని మొదలుపెట్టిన అల్లు అర్జున్... తాజా ఆరోపణలు తనకు చాలా ఆవేదన కలిగించాయని అన్నారు.
అనంతరం... శ్రీతేజ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని.. ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితిపై గంట గంటకూ అప్ డేట్స్ కనుక్కుంటున్నానని.. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతుందని తెలుస్తుందని.. ఇన్ని దురదృష్టకర సంఘటనల్లో అదొక్కటీ కాస్త మంచి విషయం అని తెలిపారు.
అనంతరం... తాను ఎవరినీ కించపరచడం లేదు.. అది డిపార్ట్మెంట్ అయినా, రాజకీయ నాయకుడిని ఉద్దేశించి అనడం లేదు అని అంటూ... సుమారు 15 రోజులుగా తాను ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని.. ఆఫీసుకు కూడా వెళ్లడం లేదని.. చాలా లోలో ఉన్నానని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
వ్యక్తిత్వ హనానానికి పాల్పడుతున్నారని.. , తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. సినిమా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి.. ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి, అన్ని ఫంక్షన్లూ క్యాన్సిల్ చేసుకుని బాధిత కుటుంబం గురించి, ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచిస్తున్నానని చెప్పారు. ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని అన్నారు.
దీంతో... అల్లు అర్జున్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పేర్లూ చెప్పకపోయినా... అక్బరుద్దీన్, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశించే అల్లు అర్జున్ స్పందించారని.. గట్టి కౌంటర్ ఇచ్చినట్లేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు దర్శనమిస్తున్నాయి. దీంతో.. ప్రస్తుతం... నెట్టింట... అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ వ్యవహారం పీక్స్ కి చేరుతుందని అంటున్నారు!