రేవంత్ సీఎం అయితే అసెంబ్లీకి కేసీయార్ వస్తారా...?

ఇప్పుడున్న పరిస్థితులు తీసుకుంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి.

Update: 2023-12-04 08:42 GMT

ఇప్పుడున్న పరిస్థితులు తీసుకుంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఆయన రాకతోనే కాంగ్రెస్ కి కొత్త వెలుగు తెలంగాణాలో వచ్చింది అన్నది అంతా నమ్ముతారు. అంతే కాదు మంచి వాక్చాతుర్యం యూత్ ఫాలోయింగ్ అన్ని వర్గాలలో ఇమేజ్ ఇవన్నీ రేవంత్ రెడ్డికి బలాలు.

తెలంగాణాలో బెస్ట్ స్పీకర్ గా కేసీయార్ ఉంటారు. విపక్షాలలో చూస్తే ఆయన స్థాయిలో కాకపోయినా చాలా వరకూ చమత్కారాలతో సెటైర్లతో విరుచుకుపడే నేతగా రేవంత్ రెడ్డి ముందు వరసలో ఉంటారు. మిగిలిన వారు రొటీన్ స్టీరియో టైప్ స్పీచ్ లనే ఇస్తారు. లైవ్ లీగా స్పీచ్ ఉండాలంటే రేవంత్ కేసీయార్ లనే చూడాలి.

ఒక విధంగా తన స్పీచ్ లతోనే జనాలను ఆకట్టుకునే నేత కేసీయార్. అలాంటి కేసీయార్ నుంచి అధికారాన్ని గుంజుకోవడానికి అదే రకమైన సెటైర్లు ఎత్తుగడలతో ఎన్నికల రాజకీయాన్ని నడిపి కాంగ్రెస్ బండిని అసెంబ్లీలోకి తెచ్చిన వారు రేవంత్ రెడ్డి. ఆయనకే సీఎం చాన్స్ అన్నది కచ్చితమైన మాట.

సరే రేవంత్ రెడ్డి సీఎం అవుతారు అనుకుంటే ఆయన ఉండే అసెంబ్లీని ప్రతిపక్షంలో ఉండే కేసీయార్ ఎలా ఫేస్ చేస్తారు అన్నదే చర్చగా ఉంది. అసలే కేసీయార్ కి అహంభావం ఎక్కువ అంటారు. ఆయన పదేళ్ళ పాటు అధికార పక్షం బెంచ్ లో ఉంటూ శాసించారు. ఇపుడు తన కంటే దాదాపుగా రెండు దశాబ్దాల వయసు చిన్న అయిన రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటే శాసనసభకు అయినా కేసీయార్ వస్తారా అన్నదే కీలకమైన చర్చగా ఉంది.

ఈ డౌట్లు ఎందుకు అంటే కేసీయార్ తన పార్టీ ఓటమి పాలు అయ్యాక కనీసం మీడియాను ఫేస్ చేయలేదు. అంతే కాదు తాను ఏమనుకుంటున్నదీ కూడా ఆడియో లేక వీడియో రికార్డు అయినా జనాలకు సందేశంగా పంపించలేదు. అంతే కాదు ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయలేదు. దీన్ని చూసిన వారు అంతా కేసీయార్ వ్యవహార శైలికి అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని ఫేస్ చేయరనే అంటున్నారు.

ఆయన అసెంబ్లీకి రాం రాం అనే అంటారు అని కూడా అంటున్నారు. అంతే కాదు రేవంత్ రెడ్డి సీఎం గా ఉండగా ఆయన ఆ వైపునకు రాకుండా జాగ్రత్త పడతారు అని ఆ తరువాతనే ఆయన ఏమైనా చేస్తారు అని అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే జగన్ తన కంటే బాగా చిన్న అయినప్పటికీ చంద్రబాబు అపోజిషన్ లీడర్ గా మూడేళ్ళ పాటు వచ్చి కూర్చున్నారు.

పైగా ఏపీలో టీడీపీకి ఘోర అవమానం జరిగింది. కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. వన్ సైడెడ్ గా విక్టరీ వైసీపీ పరం అయింది. కానీ తెలంగాణాలో అలా కాదు కాంగ్రెస్ కి సింపుల్ మెజారిటీ మాత్రమే వచ్చింది. బీయారెస్ కి 39 దాకా సీట్లు దక్కాయి. మరి బలంగానే విపక్షం ఉంది. అయినా కూడా కేసీయార్ సభకు రాకపోవచ్చు అనే మాట ఉంది. ఎందుకు అంటే దటీజ్ కేసీయార్ కాబట్టి అని అంటున్నారు.




Tags:    

Similar News

ఇక ఈడీ వంతు