సోనియ‌మ్మ మాటే శిరోధార్యం.. భారం భరిస్తున్న రేవంత్‌!

తాజాగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మే 6, 2022న వరంగల్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో రుణ మాఫీ ప్ర‌క‌టించిన‌ట్టు తెలిపారు.

Update: 2024-06-22 03:48 GMT

తెలంగాణ ప్ర‌భుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రైతుల‌కు రూ.2 ల‌క్ష‌ల రూపాయ‌ల రుణాల‌ను ఒకేసారి మాఫీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు. ఎన్నిక‌ల స‌మ యంలో పార్టీ అగ్ర నాయ‌కురాలు సోనియాగాంధీ ఇచ్చిన మాట‌ను తూ.చ‌. త‌ప్ప‌కుండా అమ‌లు చేయ‌ను న్న‌ట్టు తెలిపారు. దీని వ‌ల్ల స‌ర్కారుపై భారం ప‌డుతుంద‌ని అనుకున్నా.. ఆ భారాన్ని సంతోషంగా స్వీక‌రించ‌నున్న‌ట్టు సీఎం చెప్పారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మే 6, 2022న వరంగల్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో రుణ మాఫీ ప్ర‌క‌టించిన‌ట్టు తెలిపారు. త‌ర్వాత ఎన్నిక‌ల‌కు ముందు కూడా.. సోనియా గాంధీ ఇదే విష‌యాన్ని చెప్పార‌ని.. దీంతో రైతులు త‌మ వెంటే న‌డిచార‌ని.ఇప్పుడు వారి 'రుణం' తీర్చుకునే స‌మ‌యం వ‌చ్చింద‌న్నారు. ఒకే విడ‌త‌(సింగిల్ ఫేజ్‌)లో రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

‘వరంగల్ డిక్లరేషన్ లో రూ.2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చిందని కొందరు నోటి దురుసుగాళ్లు కామెంట్లు చేశారు. కానీ ఇప్పుడు మేం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణ‌యించాం'' అని రేవంత్ చెప్పారు. ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేదేలేద‌న్నారు. దీనివ‌ల్ల స‌ర్కారుపై భారం ప‌డుతుంద‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నార‌ని తెలిపారు. అయితే.. అన్న‌దాత‌ల కోసం.. ఎంత భార‌మైనా కాంగ్రెస్ పార్టీ మోస్తుంద‌న్నారు.

కేసీఆర్ ఏం చేశారు.

కాగా.. గ‌తంలోనూ బీఆర్ ఎస్ స‌ర్కారు రైతుల‌కు రుణ మాఫీ హామీ ఇచ్చింది. కానీ, పూర్తిస్థాయిలో దీనిని సాకారం చేయ‌లేక పోయారు. తొలిసారి రూ.16 వేల కోట్ల రుపాయాలు, రెండోసారి రూ.12 వేల కోట్లు రుణమాఫీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రెండు విడతల్లో చేసిన రుణమాఫీ రూ.28 వేల కోట్లు మాత్ర‌మే. ప్ర‌స్తుతం 60 - 72 వేల కోట్ల వ‌ర‌కు రైతుల‌కు రుణ మాఫీ చేయాల్సి ఉంటుంద‌ని అంచ‌నా. అయితే.. మొత్తం రుణ‌మాఫీ ఒకే విడత చేయాల‌ని రేవంత్ ప్ర‌భుత్వం భావిస్తున్నా.. దీనికి కొన్ని ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రి ఎలా చేస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News