మైనంపల్లి సక్సెస్ సాధించినట్లేనా ?

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతు మైనంపల్లి కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వాలని పార్టీ అధిష్టానం డిసైడ్ అయినట్లు చెప్పారు.

Update: 2023-09-28 05:18 GMT

తెలంగాణా కాంగ్రెస్ లో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతు మైనంపల్లి కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వాలని పార్టీ అధిష్టానం డిసైడ్ అయినట్లు చెప్పారు. కాబట్టి మైనంపల్లి కొడుకు రోహిత్ రావుతో కలిసి పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే కొడుకు, మద్దతుదారులతో కలిసి ఢిల్లీలో క్యాంపు వేసిన మైనంపల్లి హనుమంతరావు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ తదితరుల సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్లు రేవంత్ చెప్పారు.

రేవంత్ బహిరంగంగా చెప్పారు కాబట్టి మైనంపల్లికి రెండు టికెట్లు ఖాయమనే అనుకోవాలి. మల్కాజ్ గిరిలో తనకు మెదక్ అసెంబ్లీ టికెట్ తన కొడుక్కి ఇవ్వాలని మల్కాజర్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి చాలాకాలంగా కేసీయార్ ను డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఎంఎల్ఏ డిమాండ్ ను కేసీయార్ పట్టించుకోకుండా కేవలం మల్కాజ్ గిరిలో మాత్రమే టికెట్ కేటాయించారు. దాంతో ముందు అలిగి తర్వాత కోపంతో పార్టీపైన నోటికొచ్చింది మాట్లాడారు. అప్పటినుండి పార్టీతో గ్యాప్ పెరిగిపోయింది.

తమ కుటుంబానికి రెండు టికెట్లిస్తే తాను కాంగ్రెస్ లో చేరుతానని మైనంపల్లి కబురుచేశారు. మైనంపల్లికి జనాల్లో మంచి పట్టుంది. తన వల్ల మరో మూడు, నాలుగు నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలరని కేసీయార్ నమ్ముతున్నారు. అందుకనే తనను వదులుకోవటం ఇష్టంలేక ఇంతకాలం ఎంఎల్ఏకి వ్యతిరేకంగా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అయితే రెండో టికెట్ ఇవ్వని కారణంగా ఎంఎల్ఏ పార్టీని వదిలేశారు.

కారణాలు ఏవైనా మైనంపల్లి మొదటి సక్సెస్ సాధించినట్లే అనుకోవాలి. ఎందుకంటే కుటుంబానికి ఒకటే టికెట్ అని కాంగ్రెస్ అధిష్టానం చాలా స్పష్టంగా నేతందరికీ చెప్పేసింది. చాలామంది సీనియర్లు తమ కుటుంబాల్లో రెండు టికెట్లు అడిగినా అధిష్టానం కాదుపొమ్మన్నది. ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు మాత్రమే రెండు టికెట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఎందుకంటే ఉత్తమ్, పద్మావతి చాలాకాలంగా రెండు నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నారు కాబట్టే. అలాంటిది ఇపుడు పార్టీలో చేరుతు రెండో టికెట్ కూడా సాధించుకున్నారంటే మైనంపల్లి గట్టోరనే చెప్పాలి. ఇపుడు రెండు టికెట్లు సాధించుకుంటున్నారు సరే మరి ఎన్నికల్లో గెలుస్తారా ?

Tags:    

Similar News