నేను గుంటూరు, గుడివాడల్లో చదువుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
తాను గుంటూరు, గుడివాడల్లో చదువుకోలేదని పరోక్షంగా వైసీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. గుంటూరు, గుడివాడల్లో చదువుకుని వచ్చిన వాళ్లు.. తనకు ఇంగ్లీషు రాదని అవహేళన చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇంగ్లీషు మాట్లాడడం రాదంటూ కొందరు అవహేళన చేస్తున్నారని.. కానీ, తాను గుంటూరు, గుడివాడల్లో చదువుకోలేదని పరోక్షంగా వైసీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. గుంటూరు, గుడివాడల్లో చదువుకుని వచ్చిన వాళ్లు.. తనకు ఇంగ్లీషు రాదని అవహేళన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కానీ, జర్మనీ, జపాన్, చైనా దేశాల వారు కూడా ఇంగ్లీష్ లో వెనుకబడ్డారని, కానీ, అభివృద్ధిలో మాత్రం ముందున్నారని చెప్పారు.
ఇంగ్లీషు కేవలం కమ్యూనికేషన్ కోసమేనన్న సీఎం రేవంత్ ప్రపంచంతో పోటీ పడేందుకు కృషి ఉంటే చాలని చెప్పారు. ఉద్యోగాలను సంపాయించుకునేందుకు ఇంగ్లీషు తోడ్పడుతుందని పేర్కొన్నారు. తాను కార్పొరేట్ స్కూళ్లలో చదువు కోలేదని, గుడివాడ, గుంటూరులోనూ చదువు కోలేదని పరోక్షంగా వైసీపీ నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు. గుడివాడకు చెందిన వైసీపీ నాయకుడు నాని, గుంటూరు కు చెందిన మంత్రి అంబటి రాంబాబు తరచుగా తమ వ్యాఖ్యలతో మీడియాలో ఉంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే వారిని ఉద్దేశించి పరోక్షంగా రేవంత్ విమర్శలు గుప్పించారు. కాగా, రేవంత్ ఇంగ్లీషుపై గతంలో వైసీపీ నాయకులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆయన విదేశాలకు వెళ్లి పెట్టుబడులపై చర్చలు జరిపిన సందర్భంలో వైసీపీ నాయకులు రేవంత్ ఇంగ్లీషుపై వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే రేవంత్ వారికి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మరోసారి విమర్శలు గుప్పించారు. మరి రేవంత్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.