లోకేష్‌ కు ఆ రెండూ లేవు... జగన్ పై దాడిలో ఆర్జీవీ కౌంటర్!

ఇందులో భాగంగా... "లోకేష్‌ ట్వీట్ చూస్తే అతనికి బ్రెయిన్‌ తో పాటు హృదయం కూడా లేదన్న విషయం అర్థమవుతోంది" అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు!

Update: 2024-04-14 06:32 GMT

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పై విజయవాడలో జరిగిన "మేమంతా సిద్ధం" బస్సుయాత్రలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి నుంచి పక్కరాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతల వరకూ పలువురు స్పందిస్తూ, దాడిని ఖండిస్తూ, జగన్ కు జాగ్రత్తలు చెబుతున్నారు.

మరోపక్క కొంతమంది మాత్రం జగన్ పై జరిగిన దాడిని సానుభూతి డ్రామాగా అభివర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు! ఇంకొంతమంది దాడిని ఖండిస్తున్నట్లు చెబుతునే సోషల్ మీడియా వేదికగా వెకిలి పోస్టులు పెడుతున్నారనే విమర్శలు వైసీపీ నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... జగన్ పై జరిగిన దాడి ఘటనపై నారా లోకేష్ ఆన్ లైన్ వేదికగా స్పందించారు. ఒక ఫోటోను కూడా పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఇందులో భాగంగా... 2019 లో కోడి కత్తి - 2024లో రాయి అని అర్ధం వచ్చేలా ఒక ఫోటోతో పాటు.. "రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా! కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్!" అని పోస్ట్ చేశారు. ఈ సమయంలో ఈ పోస్ట్ కింద నడుస్తున్న కామెంట్ల వార్ సంగతి కాసేపు పక్కనపెడితే... లోకేష్ ట్వీట్ పై ఆర్జీవీ స్పందించారు!

అవును... ఏపీ ముఖ్యమంత్రిపై దాడి జరిగిన ఘటనపై ఆన్ లైన్ వేదికగా... "కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్!" అంటూ లోకేష్ చేసిన ట్వీట్ పై ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ స్పందించారు. ఇందులో భాగంగా... "లోకేష్‌ ట్వీట్ చూస్తే అతనికి బ్రెయిన్‌ తో పాటు హృదయం కూడా లేదన్న విషయం అర్థమవుతోంది" అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు!

ఇదే సమయంలో... అంత కచ్చితత్వంతో రాయి ఎలా విసిరారో నీకున్న కొద్ది పాటి జ్ఞానంతో వివరించాలి లోకేష్ అని కోరిన ఆర్జీవీ... కంటికి ఆ రాయి తగిలి ఉంటే ఎలా ఉండేది? అప్పుడు కూడా జగన్ ప్లాన్ అని అనుకునేవాడివా? అంటూ ప్రశ్నించారు. దీంతో.. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది!

Tags:    

Similar News