రిషితేశ్వరి కేసు... తల్లితండ్రుల సంచలన వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా స్పందించిన రిషితేశ్వరి తల్లితండ్రులు స్పందిస్తూ.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... ఆమె తల్లి దుర్గాబాయి కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 29 Nov 2024 4:52 PM GMTతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగార్జున యూనివర్శిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో గుంటూరు కోర్టు తీర్పు వెలువడింది. ఇందులో భాగంగా... విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న తొమ్మిదేళ్ల తర్వాత గుంటూరు జిల్లా న్యాయస్థానం కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఆమె తల్లితండ్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... తెలంగాణ రాష్ట్రం వరంగల్ కు చెందిన యువతి రిషితేశ్వరి నాగార్జున యూనివర్శిటీలో చదువుతుంది. ఈ క్రమంలో 2015 జూలై 14న ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక, ర్యాగింగ్ కారణంగా తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు యువతి సూసైడ్ నోట్ రాసింది.
అప్పట్లో ఈ ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఆ సమయంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఘటనపై తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సమయంలో.. కేసు విచారణ తుది దశకు చేరుకుంది!
ఈ నేపథ్యంలో శుక్రవారం గుంటూరు జిల్లా 5వ కోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా.. ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా స్పందించిన రిషితేశ్వరి తల్లితండ్రులు స్పందిస్తూ.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... ఆమె తల్లి దుర్గాబాయి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... తాము తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నామని.. న్యాయం జరుగుతుందని తాము భావించామని.. తమకు న్యాయం జరగలేదంటూ ఇంకెవరికీ న్యాయం జరగదంటూ ఆమె అభిప్రాయపడ్డారు! ఇదే సమయంలో... అప్పీల్ కు వెళ్లాలా లేదా అనే విషయాన్ని ఆలోచిస్తామని చెబుతూనే... ఇక పోరాడే ఓపిక లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు!
ఇదే క్రమంలో రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ స్పందిస్తూ... రిషితేశ్వరి డైరీలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అర్థం కావటం లేదని అన్నారు! డైరీలో అన్ని విషయాలూ వివరంగా ఉన్నాయని.. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా రిషితేశ్వరే డైరీ రాసినట్లు నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు!