ఆఫ్టర్ లాంగ్ గ్యాప్... బుల్లి తెరపై రోజా ఎంట్రీ!

అయితే.. 2024 ఎన్నికల్లో ఊహించని రీతిలో పరాజయం పాలవ్వడంతో కొన్ని రోజుల పాటు ఆమె కనిపించలేదు. దీంతో.. తమిళనాడు రాజకీయాలవైపు వెళ్తున్నారనే చర్చ జరిగింది.

Update: 2025-02-25 08:39 GMT

వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరనే సంగతి తెలిసిందే. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరో సరసనా నటించిన ఆమె.. అనంతరం ఆమె బుల్లితెరపైనా అలరించారు. పలు షోలకు జడ్జిగా, పార్టిసిపెంట్ గా చేస్తూ అభిమానులను, ప్రేక్షకులను తనదైన శైలిలో ఎంటర్ టైన్ చేశారు.

ఈ క్రమంలో... రాజకీయాల్లోకి అడుగుపెట్టి, వైసీపీ నుంచి నగరి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వత కూడా రోజా.. జబర్ధస్త్ షో కంటిన్యూ చేశారు. ఆమె వల్ల ఆ షోకి మరింత అందం, ఆదరణ వచ్చిందనే చర్చ అప్పట్లో నడిచింది. ఇదే సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలోనూ కనిపించి అలరించారు. ఈ సమయంలో మరోసారి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు.

అవును... 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుల్లితెరకు దూరంగా ఉంటూ.. పూర్తిస్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెట్టారు రోజా. అయితే.. 2024 ఎన్నికల్లో ఊహించని రీతిలో పరాజయం పాలవ్వడంతో కొన్ని రోజుల పాటు ఆమె కనిపించలేదు. దీంతో.. తమిళనాడు రాజకీయాలవైపు వెళ్తున్నారనే చర్చ జరిగింది.

అయితే.. ఆ ఊహాగాణాలకు చెక్ పెడుతూ ఆర్కే రోజా వైసీపీలోనే కొనసాగుతూ ఏపీ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాను వైసీపీకి ఫైర్ బ్రాండ్ నే అనే సంకేతాలు ఇస్తున్నట్లున్నారు! ఆ సంగతి అలా ఉంటే... చాలా రోజుల తర్వాత ఆర్కే రోజా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు.

ఇందులో భాగంగా... జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ షోకి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా విడుదలయ్యింది. ఇందులో రోజా తన డ్యాన్స్ తో అందరినీ ఆకటుకున్నారు. ఈ క్రమంలో... రోజాతో పాటు శ్రీకాంత్, రాశి కూడా ఈ షోలో జడ్జిలుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక... ఈ షో విషయానికొస్తే... మార్చి 2 ఆదివారం సాయంత్రం 6 గంతలకు మొదలుకానుంది. దీంతో... ఆర్కే రోజా మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఇక.. ఈ ప్రోమో చూసిన రోజా ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. దీంతో... మరో కొన్నేళ్లు ఆమె బుల్లితెరపై అలరించే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News