మరీ అంత అహంకారమా... స్టాలిన్ మీద ఫైర్
ఇది జరిగి నాలుగైదు రోజులు పై దాటింది. ఇపుడు రాజ్ భవన్ నుంచి గవర్నర్ ఆర్ ఎన్ రవి కౌంటర్ ఇచ్చారు.
రాజ్యాగం అంటే ఎవరు ఏమిటి అంటే రాష్ట్రపతిని గవర్నర్ ని చూపిస్తారు. వారు నడిచే రాజ్యాంగం అని చెబుతారు. సజీవ రాజ్యాంగం అని కూడా అంటారు. అయితే ఒక గవర్నర్ కి ముఖ్యమంత్రికి మధ్య పొరపొచ్చాలు వచ్చి అవి హద్దులు దాటేసి మరింతగా పెరిగి పెచ్చరిల్లితే ఏమవుతుంది అంటే తమిళనాడు వైపే అంతా చూడాలని అంటున్నారు.
తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్ రవికి స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య డైలాగ్ వార్ సాగుతొంది. ముఖ్యమంత్రి గవర్నర్ ని విమర్శించారు. ఆయనవి పిల్ల చేష్టలు అన్నారు. ఆయనకు తమిళనాడు అభివృద్ధి అయితే అసలు జీర్ణం కావడంలేదు అన్నారు. ఆయన తమిళ సభను అవమానించారని కూడా హాట్ కామెంట్స్ చేశారు.
ఇది జరిగి నాలుగైదు రోజులు పై దాటింది. ఇపుడు రాజ్ భవన్ నుంచి గవర్నర్ ఆర్ ఎన్ రవి కౌంటర్ ఇచ్చారు. అంత అహంకారమేంటి అని డైరెక్ట్ గా సీఎం స్టాలిన్ ని ప్రశ్నించారు. తాను చెప్పినది ఏంటి స్టాలిన్ విమర్శిస్తున్నది ఏంటి అని ఆయన మండిపడ్డారు.
ఒక అసెంబ్లీలో జాతీయ గీతాన్ని గౌరవించాలని తాను చెప్పాను అన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రాధమిక విధులు పాటించాలని తాను చెబితే అది తప్పు అని అసంబద్ధమని డీఎంకే నేతలు అంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తానవి చిన్న పిల్లల చేష్టలు మాట్లాడడమేంటి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
భారత దేశం కంటే సర్వోన్నతమైనది వేరేది లేదు అని ఆయన గుర్తు చేశారు. అంతే కాదు రాజ్యాంగమే అత్యున్నతమైనది అదే గట్టి విశ్వాసం అన్నారు. దానిని గ్రహించకుండా భారత్ ను ఓ దేశంగా గుర్తించని రీతిలో దేశ రాజ్యాంగాన్ని కూడా అగౌరవపరుస్తున్నారంటూ స్టాలిన్ పై విమర్శనాస్త్రాలు గవర్నర్ ఘాటు విమర్శలు చేశారు.
మరీ అంత అహంకారం పనికిరాదు అని చురకలు అంటించారు. కొత్త ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీని సమావేశపరచినపుడు గవర్నర్ రవి ప్రసంగించకుండా వెళ్ళిపోయారు సభను అవమానపరచారు అని డీఎంకే అంటోంది. అలా కాదు రాజ్యాంగాన్నే గౌరవించడం లేదని గవర్నర్ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.
దీనిని చూసిన మీదట ఈ మాటల మంటలు చల్లారేవి అయితే కావు అనే అంటున్నారు. ఈ విషయంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే దాని కంటే రెండు అత్యున్నత పదవులలో ఉన్న వారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉన్నత స్థానాలలో కొలువు తీరిన వారి మధ్య ఈ రకమైన విభేదాలు రావడం వాంఛనీయం కాదనే అంటున్నారు. మరి దీనిని ఎండ్ కార్డు పడుతుందా లేక కంటిన్యూ అవుతుందా అంటే రెండవదే నిజమని అంటున్న వారే ఎక్కువగా ఉన్నారు.