వైరల్... 40 ఏళ్ల నాటి టీసీఎస్ ఆఫర్ లెటర్ చూశారా?

ఈ క్రమంలో సుమారు 40 ఏళ్ల క్రితం తాను తీసుకున్న టీసీఎస్ ఆఫర్ లెటర్ ను నెటిజన్లతో పంచుకున్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.

Update: 2024-10-01 22:30 GMT

ఎవరికైనా తమ జీవితంలో చూసే మొదటి ఆఫర్ లెటర్, తీసుకునే మొదటి శాలరీ ఎప్పటికీ గుర్తుంటుందనే చెప్పాలి. ఇక టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో తొలి ఆఫర్ లెటర్ అంటే ఇక చెప్పే పనే లేదు! ఈ క్రమంలో సుమారు 40 ఏళ్ల క్రితం తాను తీసుకున్న టీసీఎస్ ఆఫర్ లెటర్ ను నెటిజన్లతో పంచుకున్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.

అవును... సుమారు 40 ఏళ్ల క్రితం తాను క్యాంపస్ ప్లేస్ మెంట్స్ ద్వారా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగం సంపాదించినప్పుడు ట్రైనీగా ఎంపికవుతూ పంపిన ఆఫర్ లెటర్ ను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రోహిత్ కుమార్ సింగ్ ఎక్స్ వేదిక్గా షేర్ చేసుకున్నారు. ఈ ఆఫర్ లెటర్ లో టీసీఎస్ ఇచ్చే వేతనం ఆసక్తిగా మారింది. అది రూ.1,300 కావడం గమనార్హం.

ఈ సందర్భంగా స్పందించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రోహిత్ కుమార్ సింగ్ తన పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ... 40 ఏళ్ల క్రితం ఐఐటీ బీ.హెచ్.యూ. క్యాంపస్ ప్లేస్ మెంట్ లో సెలక్ట్ అయినట్లు తెలిపారు. ముంబై టీసీఎస్ క్యాంపస్ లో తనకు మొదటి ఉద్యోగం వచ్చిందని.. అప్పుడు తన జీతం రూ.1,300 అని.. అప్పట్లో అది చాలా ఎక్కువని తెలిపారు.

ఇదే సమయంలో నాడు ఎయిరిండియా బిల్డింగ్, నారీమన్ పాయింట్ లో ఉన్న ఈ ఆఫీస్ 11వ అంతస్తు నుంచి సముద్రం చూసేందుకు అద్భుతంగా ఉండేదంటూ రోహిత్ కుమార్ సింగ్ గుర్తు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో టీసీఎస్ ఆఫర్ లెటర్ ఫోటోను పంచుకున్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు పలు ప్రశ్నలు సంధిస్తూ, మరిన్ని కామెంట్లు చేస్తున్నారు.

ఇందులో భాగంగా... "బిలేటెడ్ కంగ్రాట్యులేషన్స్ సర్" అని ఒకరు కామెంట్ పెడితే.. "ఐఏఎస్ ఆఫీసర్ గా మీ మొదటి నెల జీతం ఎంత?" అని మరో యూజర్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా స్పందించిన ఆయన... రూ.2,200 అని బదులిచ్చారు. ఇదే సమయంలో... టీసీఎస్ లో మరోసారి అవకాశం వస్తే చేరతారా అని ప్రశ్నించగా.. లేదంటూ స్పందించారు.

కాగా రోహిత్ కుమార్ ఐఐటీ బీ.హెచ్.యూలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం.. టీసీఎస్ ముంబై క్యాంపస్ లో కొంతకాలం పనిచేశారు. ఆపై క్లార్ సన్ యూనివర్శిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదవడానికి న్యూయార్క్ వెళ్లారు. తర్వాత యూపీఎస్ లో అర్హత సాధించారు. ప్రస్తుతం నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్ (ఎన్.సీ.డీ..ఆర్.సీ) సభ్యునిగా ఉన్నారు!

Tags:    

Similar News