నేతలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక సూచన.. మనుగడ ప్రమాదమంటూ..

'మనలో రెండు నేనులు ఉంటాయి. ఒకటి ముడిపదార్థం. మరొకటి పరిపక్వత చెందినది. ముడిపదార్థంగానే ఉండిపోతామంటే అగాధంలో పడిపోతాం' అని వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-17 16:30 GMT

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

ప్రతి ఒక్కరూ ఇగోను పక్కన పెట్టాలని.. లేదంటే అగాధంలో పడిపోక తప్పదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అభిప్రాయడ్డారు. శాశ్వత ఆనందాన్ని గుర్తించినప్పుడే నిస్వార్థకంగా సేవలు అందిస్తారని అన్నారు. ఇదే ఇతరులకు సహాయం చేయాలని ధోరణిని పెంచుతుందని పేర్కొన్నారు. సమాజంలో జరిగే ప్రతి దానిని తప్పు అనే భావన పెరుగుతోందని అన్నారు.

సమాజంలో ఏదో ఒక నెగెటివ్‌గా అంశం చోటుచేసుకుంటే.. దానికి 40 రెట్లు మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. కానీ.. సానుకూలం అంశాలేవీ ప్రజలకు చేరడం లేదన్నారు. సానుకూలం అంశాల గురించి అవగాహన కల్పించడం అవసరమన్నారు. సేవ అనేది సమాజంలో శాశ్వత నమ్మకాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ పరమహంస చెప్పిన మాటలను గుర్తు చేశారు. 'మనలో రెండు నేనులు ఉంటాయి. ఒకటి ముడిపదార్థం. మరొకటి పరిపక్వత చెందినది. ముడిపదార్థంగానే ఉండిపోతామంటే అగాధంలో పడిపోతాం' అని వ్యాఖ్యలు చేశారు.

అన్నివర్గాల సాధికారతే దేశం అభివృద్ధిని సూచిస్తుందని మోహన్ భాగవత్ తెలిపారు. దేశ పురోగతికి దోహదపడేలా యువతను తీర్చిదిద్దాలని కోరారు. అయితే.. గతంలోనూ మోహన్ భాగవత్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దేవుళ్లమని మనకు మనం స్వయంగా ప్రకటించుకోకూడదని, దానిని ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. కొంత మంది మెరుపులా మెరవాలని కోరుకుంటారని, కానీ ఆ మెరుపు మరింత చీకటిగా మారుతుందని కొందరు నేతలను ఉద్దేశించి మాట్లాడారు. మోహన్ భాగవత్ మరోసారి నేతలను టార్గెట్ చేసి మాట్లాడడంతో ఆయన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్‌లో చర్చకు దారితీశాయి.

Tags:    

Similar News