రుషికొండ పైన కూటమి మంత్రులు కొలువు!

ఇదిలా ఉంటే రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగించాలి అన్న దాని మీద ఇపుడు మంత్రులు అంతా కలసి నిర్ణయిస్తారు అని అంటున్నారు.;

Update: 2025-04-04 16:40 GMT
రుషికొండ పైన కూటమి మంత్రులు కొలువు!

విశాఖ రుషికొండ ఇపుడు మరోసారి పొలిటికల్ గా హైలెట్ కానుంది. విశాఖలోని బీచ్ రోడ్డులో రుషికొండ మీద అయిదు వందల కోట్ల వైసీపీ ప్రభుత్వం ఆధునాతన గెస్ట్ హౌస్ ని నిర్మాణం చేసింది. అయితే ఇంత ఖరీదైన భవనాల వల్ల టూరిస్టులకు ఇబ్బంది అని ఎవరూ రారు అని కూటమి నేతలు అంటూ వచ్చారు.

మరో వైపు ఈ భవనాలను దేనికి వినియోగించాలి అన్నది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఇంకా ఆలోచనలోనే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గం సమావేశంలో చంద్రబాబు ఈ రుషికొండ మీద ఏమి చేద్దామని మంత్రులతో చర్చించారు. ఆ మీదట ఆయనే మంత్రులను ప్రజా ప్రతినిధులను అందరినీ రుషికొండకు వెళ్ళాలని కోరారు.

అక్కడ ఉన్నవి అన్నీ చూడాలని ఆ తరువాత దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని సూచించారు. వీటిని అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అపుడు రుషికొండ భవనాలను ఏమి చేయాలన్నది ప్రభుత్వం ఆలోచిస్తుంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగించాలి అన్న దాని మీద ఇపుడు మంత్రులు అంతా కలసి నిర్ణయిస్తారు అని అంటున్నారు. అన్ని శాఖలను చెందిన మంత్రులు తమకు వీలు అయిన సందర్భాలలో విశాఖ వచ్చి రుషికొండ భవనాలను సందర్శిస్తారు అని అంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా కొందరు మంత్రులు వెళ్ళారు. నారా లోకేష్ రావాల్సి ఉంది. అలాగే ఇతర మంత్రులు కూడా రుషికొండను విజిట్ చేస్తారు అని అంటున్నారు.

ఉత్తరాంధ్రాలో ఉన్న మంత్రులు కూడా కొందరు ఇప్పటిదాకా రుషికొండను చూడలేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే అత్యాధునిక సదుపాయాలతో రుషికొండ భవనాలను నిర్మించారు కాబట్టి వాటిని ఇంటర్నేషనల్ సంస్థలకు అప్పగిస్తారని అంటున్నారు. విశాఖకు వచ్చే విదేశీ టూరిస్టులు కూడా అధికం అవుతున్నారు. వారు ఎంత ఖర్చు అయినా భరించే విధంగా ఉంటారు అని అంటున్నారు.

దాంతో పేరు గడించిన సంస్థలకు బిడ్ నిర్వహించి మరీ అప్పగిస్తే కనుక ప్రభుత్వానికి ఆదాయంతో పాటు విశాఖకు మరింత టూరిజం అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో ఏమి ఆలోచిస్తున్నారో ముఖ్యమని అంటున్నారు. మంత్రులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఒక ఎత్తు అయితే విజనరీ అయిన బాబుకు రుషికొండ భవనాలను వాడుకోవడం పెద్ద కష్టం కాదని అంటున్నారు. మొత్తానికి చూస్తే తొందరలోనే రుషికొండ భవనాలు వినియోగం లోకి వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News