మీకు ఇలాంటి కాల్స్ వస్తున్నాయా?... ఇప్పటికే లక్ష మందికి పైగా బాధితులు!

అవును... నకిలీ పెట్టుబడులతో లక్షల మంది నుంచి కోట్లు కొల్లగొడుతున్న కాల్ సెంటర్ల గుట్టు తెరపైకి వచ్చింది.

Update: 2024-12-10 17:30 GMT

మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్లకు కొదవలేదని అంటుంటారు. పైగా ఇప్పుడంతా ఆన్ లైన్ కాలం.. లక్షలు పెట్టుబడి పెట్టి కోట్లు సంపాదించాలనే ఆలోచనలు ఎక్కువగా కలిగిన ప్రజానికం అనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని ఎఫ్.ఎస్.ఐ. రట్టు చేసింది.

అవును... నకిలీ పెట్టుబడులతో లక్షల మంది నుంచి కోట్లు కొల్లగొడుతున్న కాల్ సెంటర్ల గుట్టు తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్.ఎస్.బీ) రట్టు చేసింది. ఈ సందర్భంగా... ప్రపంచ వ్యాప్తంగా లక్ష మందికి పైగా ప్రజలను వీరు మోసం చేసినట్లు అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు.

ఇలా వీరి భారిన పడిన ప్రజల్లో భారతీయులు కూడా ఉన్నారని.. వీరితో పాటు సుమారు 50కి పైగా దేశాల ప్రజలు బాధితులుగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ స్కాంపై దర్యాప్తు చేపట్టిన రష్యా అధికారులు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. మరో షాకింగ్ విషయాన్ని రష్యా ఎఫ్.ఎస్.బీ. అధికారులు తెరపైకి తెచ్చారు.

ఇందులో భాగంగా... ఈ కాల్ సెంటర్ ముఠాకు లండన్ లో నివాసం ఉంటున్న జార్జియా మాజీ రక్షణ మంత్రి కజెరాశ్ విలితో సంబంధాలున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో... రోజుకి కనీసం 1 మిలియన్ డాలర్ల మేర (రూ.8 కోట్లకు పైన) దోచుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. బాధితుల్లో భారతీయులు లు ఎక్కువగానే ఉన్నారని అంటున్నారు.

కాగా... ఈ స్కామర్స్ బారిన పడినవారు చాలా మంది రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్.ఎస్.బీ) కి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. దీంతో... ఈ విషయంపై పూర్తి దృష్టి కేటాయించిన ఎఫ్.ఎస్.బీ.. ఈ కుంభకోణాన్ని బయటపెట్టింది. ఈ సమయంలో... పలువురు ఆపరేటర్లను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు.

ఈ కుంభకోణంలో అరెస్టైనవారిలో ఇజ్రాయెలీ – ఉక్రెయిన్ పౌరుడు కూడా ఉండగా.. మరో ఇజ్రాయెలీ -జార్జియన్ పౌరుడు పరారీలో ఉన్నాడని అంటున్నారు. వీరిద్దరే ఈ కుంభకోణంలో కీలక సూత్రధారులని అధికారులు చెబుతున్నారు. కాగా.. ఇక్కడ పనిచేసే ఆపరేటర్లు ప్రతీ రోజూ అనేక మందికి ఫోన్ చేసి, పెట్టుబడుల స్కీంలు ఆశజూపుతూ, భారీ లాభాల మాటలతో బుట్టలో వేసుకుంటారంట.

Tags:    

Similar News