చెన్నైలో ఉగ్రవాది మరణం... అంత్యక్రియల్లో ఏమిటీ జనం?

ఉగ్రవాద సంస్థ ఎల్-ఉమ్మా వ్యవస్థాపకుడు ఎస్.ఏ.బాషా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Update: 2024-12-18 10:45 GMT

ఉగ్రవాద సంస్థ ఎల్-ఉమ్మా వ్యవస్థాపకుడు ఎస్.ఏ.బాషా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కోయంబత్తూరు వరుస పేలుళ్ల కేసులో ఫిబ్రవరి 1998 నుంచి జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు 84 ఏళ్ల బాషా. ఈ క్రమంలో అనారోగ్య కారణాలతో మద్రాసు హైకోర్టు కొన్ని నెలల క్రితం పెరోల్ పై విడుదల చేసింది. దీంతో.. కొంతకాలంగా తన కుటుంబంతో గడుపుతున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం మృతి చెందాడు. ఈ సమయంలో బాషా అంత్యక్రియల ఊరేగింపు దక్షిణ ఉక్కడం నుంచి ఉత్తర కోయంబత్తూరులోని ఫ్లవర్ మార్కెట్ వద్ద ఉన్న హైదర్ అలీ టిప్పు సుల్తాన్ సున్నత్ జమాత్ మసీదు వరకూ అంత్యక్రియల కోసం ఊరేగింపుగా తీసుకెళ్లారు! అయితే.. పదుల సంఖ్యలో ప్రజల మరణానికి కారకుడైన బాషా అంతిమయాత్రకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.

అవును... కోయంబత్తూరు వరుస పేలుళ్ల కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న బాషా అంత్యక్రియలకు వేలాది జనం తరలివచ్చారు. 58 మందిని చంపి, సుమారు 231 మంది గాయపడటానికి కోయంబత్తురు వరుస పేలుళ్ల సూత్రధారి ఈ తీవ్రవాది అని తెలిసినప్పటికీ డిసెంబర్ 17న కోయంబత్తురులో వేలాది మంది ముస్లింలు అతని అంతిమయాత్రలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.

దీంతో... ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఓ ఉగ్రవాది కోసం ఇంత భారీ ఊరేగింపు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఎలా ఇస్తుందంటూ బీజేపీ మండిపడింది. ఈ సందర్భంగా స్పందించిన బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి ఎక్స్ లో స్పందిస్తూ.. తమిళనాడు సర్కార్ పై విరుచుకుపడ్డారు.

ఇందులో భాగంగా... తమిళనాడులోని కొంతమంది రాజకీయ నాయకులు ఉగ్రవాది బాషాను సమాజానికి సేవ చేసిన వ్యక్తిగా, అమరవీరుడిగా కీర్తించడం చూసి తాను ఆశ్చర్యపోయాయని.. సుమారు 60 మంది తమిళ ప్రజలను హత్య చేసి, వందలాది మందిని గాయపరిచినందుకు జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి అతడు అని పేర్కొన్నారు.

కాగా... కోయంబత్తూరు బాంబు పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అయిన అల్-ఉమ్మా వ్యవస్థాపకుడు ఎస్.ఏ. బాషా.. ఆజం ఘౌరీ, ఫరూక్ అహ్మద్, సలీం జునైద్ వంటి ఐ.ఎస్.ఐ. ఏజెంట్ల మద్దతుతో తన సంస్థ నెట్ వర్క్ ను విస్తరించి.. దాడులు అమలు చేయడానికి ఉపయోగించాడు. ఇదే సమయంలో... 1993లో చెన్నైలోని ఆర్.ఎస్.ఎస్. కార్యాలయం బాంబు దాడిలోనూ చిక్కుకున్నాడు!

Tags:    

Similar News