సేఫెస్ట్ సిటీ వైజాగ్...!

కానీ అధికార గణాంకాలు మాత్రం విశాఖలో క్రైమ్ రేట్ బాగా తగ్గిందని చెబుతున్నాయి.

Update: 2023-12-29 17:30 GMT

విశాఖలో లా అండ్ ఆర్డర్ లేదని విపక్షాలు తరచూ విమర్శలు చేస్తూంటాయి. భూ కబ్జాలు పెరిగాయని అంటుంటాయి. విశాఖలో నేరాలు ఘోరాలు పెరిగిపోయాయని విమర్శలు చేస్తూంటాయి. కానీ అధికార గణాంకాలు మాత్రం విశాఖలో క్రైమ్ రేట్ బాగా తగ్గిందని చెబుతున్నాయి.

విశాఖ సేఫెస్ట్ సిటీ అని అంటున్నాయి. విశాఖలో ఏడాదికి సంబంధించి లా అండ్ ఆర్డర్ నివేదికను సీపీ రవిశంకర్ అయ్యర్ మీడియాకు వెల్లడించారు. 2022తో పోల్చితే విశాఖలో గడచిన ఏడాది కాలంలో నేరాల సంఖ్య ముప్పయి శాతానికి పైగా తగ్గిందని ఆయన వివరించారు.

హత్యలు కిడ్నాపులు వైట్ కాలర్ నేరాలు రోడ్డు ప్రమాదాలు ఇవ్వన్నీ కూడా బాగా తగ్గుముఖం పట్టాయని ఆయన వెల్లడించడం విశేషం. మహిళలకు సంబంధించి వివిధ నేరాలు కూడా విశాఖలో బాగా తగ్గాయని ఆయన గణాంకాలను ముందు పెట్టారు.

దిశా సెంటర్ పెర్ఫెక్ట్ గా పనిచేస్తోంది అక్కడ ఫిర్యాదులకు తక్షణ స్పందన ఉంటోందని అన్నారు. 2023లో 214 ఫిర్యాదులు దిశా సెంటర్ కి వస్తే వాటి మీద చర్యలు తీసుకున్నామని సీపీ అంటున్నారు. నేరాలను నియంత్రించే విషయంలో కఠినంగా వ్యవహరించడం వల్లనే విశాఖలో క్రైమ్ రేట్ తగ్గింది అని పోలీసు అధికారులు అంటున్నారు.

విశాఖ నగరంలో నేరాలు తగ్గడం మంచి పరిణామం అని మేధావులు సైతం అంటున్నారు. విశాఖ సిటీ అంటే కూల్ అండ్ పీస్ అని పేరు. అలాంటి సిటీని పాలనా రాజధానిగా ప్రకటించాక ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం అయితే మొదలైంది. కానీ అధికార లెక్కలు చూసినా ప్రభుత్వ గణాంకాలు చూసినా విశాఖ ఎపుడూ సేఫెస్ట్ ప్లేస్ గానే ఉంటోంది. ఇది విశాఖకు ఉన్న నాచురల్ బ్యూటీ అని అంటున్నారు.

Tags:    

Similar News