సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ఇది మామూలు ట్విస్ట్ కాదు!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై ముంబైలో ఆయన ఉంటున్న ఇంట్లోకి చొరబడిన దుండగుడు కత్తితో పలుమార్లు దాడి చేసిన ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.;

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై ముంబైలో ఆయన ఉంటున్న ఇంట్లోకి చొరబడిన దుండగుడు కత్తితో పలుమార్లు దాడి చేసిన ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ముంబైలో ప్రముఖుల భద్రత విషయంపై మరోసారి కీలక చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఈ కేసులో ఓ బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది.
అవును... ఈ ఏడాది ప్రారంభంలో అత్యంత షాకింగ్ విషయంగా మారిన వాటిలో ఒకటైన సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా... సైఫ్ ఇంట్లో దొరికిన వేలిముద్రలు, నిందితుడిగా చెబుతున్న షరీఫుల్ ఇస్లాం షెహాజాద్ వేలిముద్రలతో సరిపోవడం లేదని పోలీసులు తేల్చి చెప్పారు!
ఈ మేరకు పోలీసులు కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో ఈ విషయాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది! ఇటీవలే ముంబై పోలీసులు సుమారు 1,000 పేజీల ఛార్జ్ షీట్ ను కోర్టులో సమర్పించారు! ఈ క్రమంలో సీఐడీ ఫింగర్ ప్రింట్ బ్యూరో మొత్తం 20 వేలిముద్రల నమూనాలు సేకరించగా.. వాటిలో 19 నమూనాలలో షరీఫుల్ నమూనాలతో సరిపోలలేదు!
కాగా... జనవరి 16 - 2025 తెల్లవారుజామున ముంబైలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడ్డాడని.. ఈ సమయంలో మహిళా సిబ్బందిపై దాడి జరపగా.. ఆ శబ్ధాలు విని నటుడు అడ్డుకున్నాడు. ఈ ఘటనలో ఇంట్లోకి చొరబడిన వ్యక్తి సైఫ్ పై పలుమార్లు కత్తితో దాడి చేయడంతో.. తీవ్రంగా గాయపడ్డారు.
దీంతో.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో సైఫ్ ఇంట్లోని పింగర్ ప్రింట్స్ సేకరించారు. ఈ క్రమంలో ఫ్లాట్ లోని వివిధ ప్రాంతాల్లో 20 వేలిముద్రల నమూనాలను కనుగొన్నట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ సమయంలో అనుమానితుడు బంగ్లాదేశ్ కు చెందిన షెహజాద్ ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే... దర్యాప్తులో అతడి వేలిముద్రలతో.. ఘటనా స్థలంలో సేకరించిన వేలిముద్రల నమూనాలు సరిపోలడం లేదని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది! దీంతో... ఈ కేసులో ఇది మామూలు ట్విస్ట్ కాదనే చర్చ తెరపైకి వచ్చింది!
కాగా... సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ఓ బిగ్ ట్విస్ట్ నెలకొందని జాతీయ మీడియాలో జనవరి మూడోవారంలోనే కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సైఫ్ ఇంట్లో, దాడి జరిగిన ప్రదేశం నుంచి సేకరించిన వేలిముద్రలతో.. నిందితుడిగా చెబుతున్న షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు మ్యాచ్ కావడం లేదని బాంద్రా పోలీసులకు ఫోరెన్సిక్ టీమ్ వెల్లడించినట్లు కథనాలొచ్చాయి.