ఐఐటీలో స్క్రీన్ పై పో*ర్న్!.. పిట్రోడా వ్యాఖ్యలకు స్ట్రాంగ్ రిప్లై వచ్చేసింది!

ఫిబ్రవరి 22న మహాత్మగాంధీ ఔచిత్యంపై చర్చలో భాగంగా తాను రాంచీలోని ఐఐటీ విద్యార్థులతో వర్చువల్ మాట్లాడినట్లు శామ్ పిట్రోడా తెలిపారు.

Update: 2025-02-27 09:14 GMT

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఐఐటీ రాంచీ విద్యార్థులతో తాను వర్చువల్ గా ప్రసంగిస్తుండగా.. ఆ సమయంలో స్క్రీన్ పై ఎవరో అసభ్యకరమైన వీడియోలు ప్రదర్శించారని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు తీవ్ర సంచలనంగా మారాయి.

ఫిబ్రవరి 22న మహాత్మగాంధీ ఔచిత్యంపై చర్చలో భాగంగా తాను రాంచీలోని ఐఐటీ విద్యార్థులతో వర్చువల్ మాట్లాడినట్లు శామ్ పిట్రోడా తెలిపారు. ఆ సమయంలో తమ కాన్ఫరెన్స్ ను ఎవరో హ్యాక్ చేశారని.. అనంతరం స్కీన్ పై అసభ్యరకమైన చిత్రాలను ప్రదర్శించారని.. ఫలితంగా తాను తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా... ఇది న్యాయమా.. ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించిన ఆయన... సంస్థలకు స్వయంప్రతిపత్తి ఉండటమే అసలైన ప్రజాస్వామ్యం అని తెలిపారు. అయితే... ఈ వ్యాఖ్యలపై కేంద్ర విద్యాశాఖ స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది.

అవును.. తాను రాంచీలోని ఐఐటీ విద్యార్థులతో వర్చువల్ మాట్లాడిన సమయంలో స్క్రీన్ పై అసభ్యకర చిత్రాలు ప్రదర్శించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ సీరియస్ గా స్పందించింది. ఈ సందర్భంగా... అసలు రాంచీలో ఉన్నది ఐఐటీనే కాదని.. అది ఐఐఐటీ విద్యా సంస్థ అని తెలిపింది.

ఇదే సమయంలో.. అసలు ఆయనను ఎలాంటి కాన్ఫరెన్స్ కు ఆహ్వానించలేదని ఆ విద్యాసంస్థ ధృవీకరించిందని తెలిపింది. దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థపై బురద చల్లేందుకు ఆయన ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.

కాగా... ఇటీవల చైనా విషయంలో భారత్ వైఖరిపై పిట్రోడా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. చైనాను శత్రువులా చూడోద్దని.. చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించనివిధంగా ఉంటుందని.. ఆ దేశాన్ని గుర్తించి, గౌరవించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. దీనిపైనా బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News