సనాతన ధర్మం...అసలు ఏమిటి ?

సనాతన ధర్మం అని ఈ మధ్య ఒక మాట వినిపిస్తోంది. అది సాధు సంతులు వాడినా పెద్దగా జన బాహుళ్యంలోకి పోయేది కాదు.

Update: 2024-09-27 01:30 GMT

సనాతన ధర్మం అని ఈ మధ్య ఒక మాట వినిపిస్తోంది. అది సాధు సంతులు వాడినా పెద్దగా జన బాహుళ్యంలోకి పోయేది కాదు. కానీ ఒక పాపులర్ సినీ స్టార్ కం పొలిటీషియన్ అయిన పవన్ కళ్యాణ్ వాడారు. ఆయన సనాతన ధర్మం గురించి పెద్ద గొంతుతో మాట్లాడారు.

పవన్ అంటే యువత సహా వివిధ సామాజిక వర్గాలు ఎంతో ఆకర్షితం అవుతాయి. ఆయన మాటలను వారు స్పూర్తిగా తీసుకుంటారు. ఇపుడు పవన్ నోటి వెంట సనాతన ధర్మం మాట వచ్చింది కాబట్టి దాని గురించే యూత్ సహా అంతా తెగ సెర్చ్ చేస్తున్నారు

దాని అర్ధం ఏంటి పరమార్ధం ఏమిటి అని కూడా కూడా అన్వేషిస్తున్నారు. అయితే అది కొంతవరకూ గూగుల్ సెర్చ్ లో దొరికినా దాని విస్తృత అర్ధం తెలుసుకోవాలంటే పెద్దలను ఆశ్రయించాల్సిందే. ఇటీవల కాలంలో సనాతన ధర్మం మాట వినిపించలేదు. మళ్లీ ఇపుడు ఆ పదమే పాపులర్ అయింది.

దాంతో ఇంతకీ సనాతన ధర్మం అంటే ఎలా ఉంటుంది అన్నది పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సనాతన ధర్మం అంటే అర్ధం చూస్తే శాశ్వతమైనది, పవిత్రమైనది, స్థిరమైనది అని ఉంటుంది. ఏది ఎప్పటికీ పాతబడదో ఏది నిత్య నూతనంగా ప్రకాశిస్తుందో దానినే సనాతన ధర్మం అంటారు. కాలాలకు అతీతంగా వెలిగే ఆ వెలుగునే ధర్మం అని పిలుస్తారు. ఆధ్యాతిక పరులు అయితే దీనినే చెబుతారు.

ఎన్ని ధర్మాలు వచ్చిన ఎన్ని కొత్త నీతులు వచ్చినా రీతులు వచ్చినా కూడా సనాతన ధర్మం అంటే శాశ్వతంగా నిలిచేది అని కూడా అంటారు. ఆ విధంగా సనాతన ధర్మం గురించి చాలానే ఉంది చెప్పడానికి తెలుసుకోవడానికి.

అంతే కాదు హిందువులు తమను సనాతనవాదులుగా పేర్కొంటారు. అంటే హిందూ మతానికి ఆది ఎక్కడా లేదు, దాని పుట్టుక చెప్పలేరు. మిగిలిన మతాలకు ఒక డేట్ ఉంది. కానీ హిందూ మతానికి అది లేదు. అంటే అది సృష్టికి ముందే ఉన్నది అని కడు సనాతనమైనది అని కూడా చెబుతారు.

అందుకే హిందూత్వం అంటే మొత్తం సకల సృష్టికి జీవనాధారం అని కూడా చెబుతూంటారు. హిందూత్వ అన్నది జీవన విధానం అని కూడా ఇటీవల కాలంలో చెబుతున్నారు. అంటే ఏదైనా మనిషిగా జీవించేందుకు ఉపయోగపడే ధర్మం ఉంటుందో దానినే సనాతన ధర్మం అని కూడా అనవచ్చు అంటారు.

జీవన ధర్మాన్ని విధానాని నినాదంగా చేసుకుని ప్రజ్వలంగా ప్రకాశిస్తూ యుగాలుగా కొనసాగుతున్న హిందూ మతం కంటే సనాతనం వేరేది ఉండదని అంటారు. అందుకే సనాతన ధర్మం అంటేనే హిందువులు ఎక్కువగా ప్రేమిస్తారు. తాను సనాత భావనతో ఉంటామని కూడా గొప్పగా ప్రకటించుకుంటారు.

ఆ విధంగా చూస్తే హిందూ మతానికి అసలైన పేరు సనాతన ధర్మం అని కూడా అంటారు. హిందూ పదం మధ్యలో ఎలా వచ్చింది అంటే ఇది భౌగోళికంగా ప్రాదేశికంగా వచ్చిన పేరు తప్ప హిందువుకు అసలైన పేరు సనాతనమే అని కూడా అంటారు.

ఇదిలా ఉంటే సనాతన ధర్మం మీద ఆధునిక వాదులు అభ్యుదయవాదులు విమర్శలు చేస్తారు. అది మూఢత్వం వైపు తీసుకుని వెళ్తుందని కూడా వారు వాదిస్తారు. కానీ ఎప్పటికీ ప్రశాంతమైన జీవన తీరుని అందించేదే సనాతన ధర్మం అని కూడా ప్రవచనకర్తలు చెబుతారు.

ప్రపంచం అంతా శాంతిగా ఉండాలని అంతా బాగుండాలని కోరుకునేది సనాతన ధర్మం అంటారు. అంతే కాదు సనాతన ధర్మం అన్నది లేకపోతే ఈ ప్రపంచం శాంతిగా ఉండలేదని కూడా అంటారు. మొత్తానికి సనాతన ధర్మం మీద ఇపుడు ఆసక్తి పెరిగిందా అంటే దాని గురించి తెలుసుకోవాలన్న అనురక్తి అయితే పెరిగింది అని చెప్పాలి. మరి ఇది ఏ వైపునకు దారి తీస్తుందో కూడా చూడాలి. ఏది ఏమైనా సనాతన ధర్మం గురించి అంతా చర్చించుకునేలా చేసిన పవన్ కళ్యాణ్ ధన్యుడే అని కూడా చెప్పాల్సి ఉంది అంటున్న వారూ ఉన్నారు.

Tags:    

Similar News