షమీతో సానియా పెళ్లి... స్పందించిన టెన్నిస్ స్టార్ తండ్రి!
"ఇవన్నీ చెత్తవార్తలు.. సానియా కనీసం షమీని కలవనే లేదు" అని సానియా తండ్రి రియాక్ట్ అయ్యారు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ తో విడిపోయినట్లు వార్తలు వచ్చిన అనంతరం తాజాగా భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇందులో భాగంగా... టీంఇండియా క్రికెటర్ మహ్మద్ షమీని సానియా పెళ్లాడనున్నారని కొన్ని కథనాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో... సానియా మీర్జా తండ్రి తాజాగా స్పందించారు.
అవును... పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో ఇటీవలే వివాహబంధానికి ముగింపు పలికిన సానియా మీర్జా... మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారని గతకొంతకాలంగా వదంతులు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో... వరుడు టీంఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ అని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సానియా మీర్జా తండ్రి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఇవన్నీ చెత్త వార్తలని కొట్టిపారేశారు.
"ఇవన్నీ చెత్తవార్తలు.. సానియా కనీసం షమీని కలవనే లేదు" అని సానియా తండ్రి రియాక్ట్ అయ్యారు. దీంతో... షమీ - సానియాల వివాహానికి సంబంధించి వస్తోన్న ఊహాగాణాలను కొట్టిపారేసినట్లయ్యింది. అయితే ఈ విషయంపై అటు సానియా కానీ, షమీ కానీ ఇంకా రియాక్ట్ అవ్వలేదు! ఈ రియాక్షనే మాగ్జిమం అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి!
కాగా... షోయబ్ మాలిక్ - సానియా మీర్జాల వివాహం 2010లో జరిగిన సంగతి తెలిసిందే. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే... ఈ ఏడాది జనవరిలో షోయబ్ మరో అమ్మాయిని వివాహం చేసుకోవడంతో.. వీరిద్దరూ విడిపోయినట్లు స్పష్టమైంది! దీనిపై సానియా మీర్జా నేరుగా స్పందించనప్పటికీ... ఇటీవల హజ్ యాత్రకు వెళ్తూ మాత్రం ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది.
ఇందులో భాగంగా... ఈ యాత్రతో తన జీవితంలో కీలక మార్పు వస్తుందని ఆశిస్తున్నానని.. బలమైన వ్యక్తిగా తిరిగి వస్తానని ఆమె పోస్ట్ పెట్టారు. దీంతో... తన వైవాహిక జీవితాన్ని ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టారనే అభిప్రాయాలు తెరపైకి వచ్చాయి.
ఇక టీంఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ విషయానికొస్తే... ఇతనికి 2014లో హసీన్ జహాన్ తో వివాహం అయ్యింది. అయితే గత కొన్నేళ్లుగా వీరిమధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్థలు వచ్చాయనే కథనాలు వచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు! వీరి విడాకులకు సంబంధించిన కేసుపై ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.