సంజయ్ దత్ జైలు జీవితంపై లాయర్ ఏమన్నారంటే?
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ 1993 ముంబై పేలుళ్ల కేసులో జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జైలు జీవితం సంజయ్ దత్ లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ 1993 ముంబై పేలుళ్ల కేసులో జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జైలు జీవితం సంజయ్ దత్ లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా తన అహన్ని జైలు జీవితం తొలగించిందని దత్ స్వయంగా అన్నారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని.. ఓమనిషి సానుకూలంగా ఎలా ఉండాలో జైలు నేర్పిస్తుందని..అసలైన జీవితం ఎలా ఉంటుందో జైలు రుచి చూపించిందన్ని అన్నారు.
తాజాగా సంజయ్ దత్ జైలు జీవితం గురించి ఆయన న్యాయవాది ప్రదీప్ రాయ్ మరన్ని విషయాలు వెల్లడించారు. జైలు లో ఆయన జీవితం ఎలా సాగింది? ఎలాంటి ఆలోచనలతో ఉండేవారు? వంటి విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే.. `సంజయ్ ఒకసారి బట్టలు వేసుకున్న తర్వాత వాటిని మళ్లీ తిరిగివేసుకునే వారు కాదు. కానీ జైలుకెళ్లాక అదంతా మారిపోయింది. ఆయన జైలు జీవితాన్ని ఎంతో సానుకూలంగా తీసుకున్నారు. ఇప్పుడాయన ఎంతో మారిపోయారు. నన్ను కలిసినప్పుడు.. `ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నా కూతురు కూడా పెరిగి పెద్దదైంది అని చెప్పాను.
ఆయన ఆ మాట వినగానే నవ్వారు. మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అతను జైలుకు వెళ్లే రోజు నేను ముంబైకి వెళ్లలేకపోయాను. అతను నాకు ఫోన్ చేసి లోపలికి వెళ్తున్నానని చెప్పారు. అప్పుడు నాకెంతో బాధగా అనిపించింది. ఒకసారి వేసిన బట్టలు మళ్లీ రెండవసారి వేయరు. కానీ జైలులో ఒకేరకమైన దుస్తుల్లో ఉన్నారు. ఆయన జైలు నుంచి బయటకు వస్తోన్న సమయంలో అరిగిపోయిన.. చిరిగిపోయిన వస్త్రంతో వచ్చారు. అతను దానిని నాకు చూపించారు. ఇంకా చెప్పలేని విషయాలు చాలా ఉన్నాయి.
జైల్లో ఉన్న సమయంలో సంజయ్‌కు కొన్ని హత్య బెదిరింపులు కూడా వచ్చాయని చెప్పారు. అలాగే జైలులో తొటి ఖైదీలతో ఎంతో స్నేహంగా మెలిగారు. ఆయన వాళ్లకు నటన కూడా నేర్పారు. అక్కడ నాటకం వేయాలని ప్రయత్నించారు. కానీ అనుమతి ఇవ్వలేదు. భద్రతా పరమైన ముప్పు ఉండటంతోనే అధికారులు ఒప్పుకోలేదు. అయినా దాన్ని ఆయన సమస్యగా భావించలేదు. ఒక వ్యక్తి బయట ఆటగాడు అయితే లోపల ఆడుతాడు. బయట నటించే వాడు అయితే లోపల నటిస్తాడు. తన కళని మాత్రం జైలులో నలుగురుకి పంచారు` అని అన్నారు