నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ పై హత్యాయత్నం కేసు.. ఫిర్యాదు ఎవరంటే..?

ఈ సమయంలో వైసీపీ నేత, మరో వ్యక్తి పైనా తాజాగా హత్యాయత్నం కేసు నమోదైంది.

Update: 2024-10-26 09:36 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరూ శ్రీకృష్ణ జన్మస్థలాన్ని చూస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కువగా వినిపిస్తుంది. మరోపక్క.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో వైసీపీ నేత, మరో వ్యక్తి పైనా తాజాగా హత్యాయత్నం కేసు నమోదైంది.

అవును... గత ప్రభుత్వ హయాంలో మరుగునపడినట్లు చెబుతున్న పలు కేసులపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించినట్లు చెబుతున్నారు. అప్పుడు దాడులకు పాల్పడింది వైసీపీ నేతలు కావడం, ఉన్న ప్రభుత్వం కూడా ఆ పార్టీకి సంబంధించిందే కావడంతో నాడు ఫిర్యాదులపై చర్యలు తీసుకునే సాహసం పోలీసులు చేయలేదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో పోలీసులు మాత్రం ఫుల్ బిజీ అయిపోయినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ తో పాటు బోరుగడ్డ అనిల్ పైనా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదైంది. బీజేపీ నేత, ప్రస్తుత మంత్రి సత్యకుమార్ పై దాడి ఘటనలో వీరిపై కేసు నమోదైంది.

2023లో మూడు రాజధానుల శిబిరం వద్ద సత్యకుమార్ పై దాడి జరిగింది. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై బీజేపీ నేతలు సుమారు 25 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఏ1 గా నందిగం సురేష్, ఏ2 గా బోరుగడ్డ అనిల్ ను చేర్చారు!

Tags:    

Similar News