మైక్రోసాఫ్ట్ లో ప్రొడక్టివిటీ పారడాక్స్... లీడర్లపై సత్య నాదేళ్ల కీలక వ్యాఖ్యలు!

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లో నెలకొన్న సమస్యలపై తాజాగా మాట్లాడారు ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల.

Update: 2024-09-17 15:30 GMT

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లో నెలకొన్న సమస్యలపై తాజాగా మాట్లాడారు ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల. ఈ సందర్భంగా సంస్థ "ఉత్పాదక పారడాక్స్"తో పోరాడుతోందని అన్నారు. లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ తో ముచ్చటించిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఉత్పాదకత సమస్యలపై ఆయన స్పందించారు.

అవును... మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల తాజాగా కంపెనీ ఉత్పాదక సమస్యలపై స్పందించారు. ఈ సందర్భంగా చాలా మంది మేనేజర్లు.. ఉద్యోగులు పనిలో జాప్యం చేస్తున్నారని నివేదించగా.. తాము చాలా కష్టపడి పనిచేస్తున్నట్లు మెజారిటీ ఉద్యోగులు చెబుతున్నారని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా... కోవిడ్ మహమ్మారి అలజడి తర్వాత పని ప్రదేశాల్లో వచ్చిన విధివిధానాలు, మొదలైన సవాళ్లతో ఉత్పాదక సమస్యలు వెంటాడుతున్నాయని సత్య నాదెళ్ల వెల్లడించారు. ఈ క్రమంలోనే... 85 శాతం మంది ఉద్యోగులు సరిగా పనిచేయడం లేదని మేనేజర్లు భావిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఉద్యోగుల వెర్షన్ ను వెల్లడించారు.

ఇందులో భాగంగా... 85శాతం మంది ఉద్యోగులు తాము చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నట్లు చెబుతున్నారని అన్నారు. ఈ రెండింటికీ సంబంధించిన డేటా తమవద్ద ఉందని.. ఈ డేటాను ఉపయోగించి ఈ సమస్యపై దృష్టిసారిస్తామని అన్న్నారు. రెండు విభిన్నమైన ఈ విషయాన్ని ఇరు కోణాల్లో ఎలా చూడాలనే విషయంపై చర్చిస్తున్నట్లు సత్య నాదేళ్ల అన్నారు.

ఈ క్రమంలో.. ఈ సమస్యను పరిష్కరించడానికి ఓ మార్గం ఉందని చెప్పిన సత్య నాదెళ్ల... లక్ష్యాలను ఎలా నిర్వర్తించాలనే విషయాన్ని ముందు లీడర్లు అర్ధం చేసుకోవాలని అన్న్నారు. ఇలా లీడర్లుగా ఉంటూ లక్ష్యాన్ని చేరుకొనేందుకు పాటించాల్సిన విధివిధానాల గురించి అర్ధం చేసుకొవాలని తెలిపారు.

ఈ సమయంలో ముందుగా ఎంచుకున్న విధానాలు పనికిరానివి అనుకుంటే వెంటనే పక్కన పెట్టి కొత్త నియమాలు తీసుకురావాలని అన్నారు. నిత్యం సరికొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని లీడర్లకు సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్పష్టతతో ముందుకెళ్లి సమస్యలను పరిష్కరించగల నాయకుల అవసరం ఉందని అన్నారు.

Tags:    

Similar News