ఇంటర్వ్యూ కోసం మొయిల్ చేస్తే 4 నిమిషాలకే రిప్లై ఇచ్చిన సత్యనాదెళ్ల

ఆశ్చర్యకరంగా అతను మొయిల్ పంపిన నాలుగు నిమిషాలకే సత్య నాదెళ్ల నుంచి రిప్లై వచ్చినట్లుగా పేర్కొన్నారు.

Update: 2025-02-21 08:30 GMT

మైక్రోసాఫ్ట్ సీఈవోగా వ్యవహరిస్తున్న తెలుగోడు సత్య నాదెళ్ల చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయనతో యూట్యూబ్ పాడ్ కాస్ట్ కోసం అమెరికాలో నివాసం ఉంటున్న భారత సంతతికి చెందిన యూట్యూబర్ ద్వారకేశ్ పటేల్ ప్రయత్నించారు. ఇందుకోసం ఒక చిన్న మొయిల్ ను సత్య నాదెళ్లకు పంపారు. ఆశ్చర్యకరంగా అతను మొయిల్ పంపిన నాలుగు నిమిషాలకే సత్య నాదెళ్ల నుంచి రిప్లై వచ్చినట్లుగా పేర్కొన్నారు.

వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు.. టెక్ సంస్థ వ్యవస్థాపకులతో పాడ్ కాస్ట్ లు నిర్వహిస్తూ ఉంటారు ద్వారకేశ్. తన యూట్యూబ్ న్యూస్ లెటర్ సబ్ స్ర్కైబర్ల జాబితాలో సత్య నాదెళ్ల ఉండటంతో.. ఆయనతో షో చేయాలన్న తన ఆసక్తిని ఒక చిన్న ఈ మొయిల్ రూపంలో పంపారు. ‘హాయ్ సత్య. నా న్యూస్ లెటర్ సబ్ స్క్రైబర్ లిస్టులో మీరు ఉండటం గమనించా. నా షోలో పాల్గొనేందుకు మీరు ఆసక్తిగా ఉన్నారా?’ అంటూ చిన్న ఈ మొయిల్ పంపారు.

అదే మొయిల్ లో తాను మార్క్ జుకర్ బర్గ్.. టోనీ బ్లెయిర్ లాంటి ప్రముఖులను ఇప్పటికే పాడ్ కాస్ట్ చేసినట్లుగా అందులో వివరించారు. ఈ-మొయిల్ పంపిన నాలుగు నిమిషాల్లోనే సత్య నాదెళ్ల నుంచి రిప్లై వచ్చిన విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇ-మొయిల్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. అంతేనా.. తాజాగా ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను యూట్యూబ్.. ఎక్స్ వేదికగా షేర్ చేసిన అతను.. తాజా పాడ్ కాస్ట్ లో సత్య నాదెళ్ల తన 34 ఏళ్ల తన కెరీర్ తో పాటు పలు అంశాలపై మాట్లాడారు. అత్యున్నత స్థానంలో ఉండి కూడా.. చిన్నపాటి ఈమొయిల్ కు స్పందించిన తీరు అందరిని ఆకర్షిస్తోంది.

Tags:    

Similar News