ఎంతో బరువు.. ఎంతో బాధ్యత.. 'సత్యకుమార్' స్పెషల్...!
బీజేపీ నాయకుడు.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మవరం ఎమ్మెల్యే సత్యకు మార్ యాదవ్‌కు బరువు
బీజేపీ నాయకుడు.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మవరం ఎమ్మెల్యే సత్యకు మార్ యాదవ్‌కు బరువు .. బాధ్యతలు కూడా పెరిగాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యం లో బీజేపీకి ఒక మంత్రి పీఠాన్ని అప్పగించారు చంద్రబాబు. అయితే.. గతంలోనూ బీజేపీతో కలిసి ఉన్న ప్పుడు.. రెండు మంత్రి పదవులు ఇచ్చారు. వాటిలోనూ వైద్య ఆరోగ్య శాఖ ఉంది. అప్పట్లోకామినేని శ్రీనివాస్ మంత్రిగా పనిచేశారు.
అంటే.. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖను నిర్వహించడం.. బీజేపీకి కొత్తకాదు. ఈ నేపథ్యంలోనే సత్యకుమా ర్ కు ఈ శాఖ అప్పగించారని తెలుస్తోంది. ఇదిలావుంటే.. అప్పటి ఇప్పటికీఅనేక మార్పులు చోటు చేసు కున్నాయి. కొత్త తరహా వ్యాధులు కూడా తెరమీదికి వస్తున్నాయి. దీంతో ప్రతి రోజూ ఒక సవాల్‌గానే ఉంద ని చెప్పాలి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులను గత ప్రభుత్వం ఇన్నోవేటివ్ చేయాలని నిర్ణయిం చుకుని.. నాడు-నేడు కార్యక్రమం ద్వారా రూపురేఖలు మార్చేందుకు ప్రయత్నించింది.
దీనిని కొనసాగిస్తే.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య శాలలు కూడా కొత్తరూపు సంతరించుకుంటాయి. అలానే.. ఆరోగ్య శ్రీపథకంలో భాగంగా.. గత ప్రభుత్వం కీలక రోగాలను కూడా దీనిలో చేర్చింది. ఇవి డబ్బులు ఖర్చయ్యే వే అయినా.. పేదలకు మేలు చేస్తున్న నేపథ్యంలో వీటిని కొనసాగించాల్సి ఉంది. అయితే.. ఎటొచ్చీ.. నిధుల సమస్య నూతన మంత్రి సత్యకుమార్‌కు సవాల్గా మారనుంది. వైద్య శాఖలో వచ్చేదిఉండకపోగా.. మందులు.. సేవల రూపంలోనిధుల ఖర్చు పెరుగుతోంది.
ప్రధానంగా ఆరోగ్య శ్రీ నెటవర్క్ ఆసుపత్రలు బిల్లులు కొండల్లా పేరుకుపోయాయి. వీటిని కూడా సత్య కు మార్ పరిష్కరించాల్సి ఉంది. కొత్త గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 17 వైద్య కాలేజీల్లో ప్రస్తుతం 6 కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిని పూర్తి చేయడంతోపాటు.. మరిన్ని కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతి తీసుకురావాలి. ఇది సత్యకుమార్‌కు ఈజీనే కావొచ్చు. అదేవిధంగా గ్రామీణ విలేజ్ క్లీనిక్‌లను గత ప్రభుత్వం ప్రారంభించింది. వీటిని కూడా రాజకీయ భేషజాలకు పోకుండా.. కొనసాగించడం ద్వారా.. ప్రజలకు మేలు చేసిన మంత్రిగా పేరు స్థిరం చేసుకుంటారు.