ఆదిమూలం వర్సెస్ హేమలత.. సత్యవేడులో వేడెక్కిన పాలిటిక్స్..!
సత్యవేడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలక నియోజకవర్గం. వైసీపీ నుంచి బయటకు వచ్చి.. టీడీపీలో చేరి... గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు కోనేటి ఆదిమూలం;

సత్యవేడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలక నియోజకవర్గం. వైసీపీ నుంచి బయటకు వచ్చి.. టీడీపీలో చేరి... గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు కోనేటి ఆదిమూలం. అయితే.. పట్టుమని ఆరు మాసాలు కూడా తిరగకుండానే.. ఆయన ఓ వలపు వలలో చిక్కుకుని అభాసుపాలయ్యారు. తర్వాత.. సదరు మహిళ కేసును విత్‌డ్రా చేసుకోవడం.. చంద్రబాబు నుంచి బలమైన వార్నింగ్ వెళ్లడంతో ప్రస్తుతం సర్దుకున్నారు. కానీ ఆయన సర్దుకున్నా.. స్థానికంగా రాజకీయాలు మాత్రం వేడెక్కుతూనే ఉన్నాయి.
ఆదిమూలం స్థానంలో ఇంచార్జ్ గా హేమలత అనే మాజీ మహిళా ఎమ్మెల్యేని నియమించాలన్న డిమాండ్లు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో సత్యవేడు టీడీపీ రాజకీయాలు సలసల మంటున్నాయని అంటున్నా రు పరిశీలకులు. గత ఎన్నికల్లో టికెట్టు రాని మాజీ ఎమ్మెల్యే హేమలత తన అనుచరులను తాజాగా అమరావతి పంపారు. ఎమ్మెల్యే ఆదిమూలం తీరుతో పార్టీకి నష్టం జరుగుతోందని ఆమె వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టిలో పెట్టారు. ఇది జరిగివారం అయింది.
అయితే.. ఇప్పటి వరకు.. పార్టీ అధిష్టానం నుంచి హేమలతకు ఎలాంటి కబురు అందలేదు. అయితే.. ఆదిమూలంపై సానుకూలత కూడా వ్యక్తం కావడం లేదు. వాస్తవానికి వైసీపీ నుంచి వచ్చిన ఆదిమూలా నికి.. టీడీపీ కేడర్‌పై పట్టులేదు. పైగా..ఆయనను విభేదిస్తున్నవారే ఎక్కువగా ఉన్నారు. దీంతో వైసీపీ నాయకులతో ఎమ్మెల్యే ఆదిమూలం అంటకాగుతున్నారన్న చర్చ సైకిల్ పార్టీలో ప్రధానంగా వినిపిస్తోం ది. ఈ నేపథ్యంలో ఆయనను పక్కన పెట్టి హేమలతకు పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ తెరమీదికి వచ్చింది.
ఈ వ్యవహారం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ హాట్‌గా నడుస్తోంది. ఎమ్మెల్యే అదిమూలం అనుచరులు, ఇతర పార్టీ సీనియర్స్ కూడా దీనిమీద సీరియస్‌గానే ఉన్నట్టు సమాచారం. గత ఎన్నికల నుంచి కూడా.. ఆదిమూలంపై.. హేమలత వర్గం ఆగ్రహంతోనే ఉంది. ఆయన పార్టీలోకి రాకుండా ఉంటే.. టికెట్ తనకే దక్కి ఉండేదన్నది హేమలత వాదన. కానీ, ఆయన తన అవకాశాన్ని కొట్టేశారని చెబుతోంది. ఈ నేపథ్యం లో ఇప్పుడు మరింతగా వివాదం రాజుకుని.. ఏకంగా అమరావతికి చేరింది. మరి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.