ఉమ్రా, హజ్ పేరుతో పాక్ బిచ్చగాళ్ల మాఫియా... ఫత్వా జారీచేసిన సౌదీ!
ఉమ్రా, హజ్ వీసాలతో తమ దేశానికి వస్తున్న పాకీస్థానీ యాచకుల వ్యవహారంపై సౌదీ అరేబియా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది.
ఉమ్రా, హజ్ వీసాలతో తమ దేశానికి వస్తున్న పాకీస్థానీ యాచకుల వ్యవహారంపై సౌదీ అరేబియా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా వీరు భారీ సంఖ్యలో రావడంపట్ల ఆసక్తికరమైన ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా... ఇంత పెద్ద ఎత్తున బిచ్చగాళ్లను తమ దేశానికి పంపడం వెనుక మాఫీయా ఉన్నట్లు తెలిపింది.
అవును... ఉమ్రా, హజ్ పేరు చెప్పి భారీ సంఖ్యలో పాకిస్థాన్ కు చెందిన బిచ్చగాళ్లు తమ దేశానికి వస్తుండటంపై సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పాక్ జాతీయులు తమ దేశంలో బిచ్చమెత్తుకుంటుంటే భారీ జరిమానా విధించనుండటంతో పాటు, ఇంకెప్పుడు సౌదీ రాకుండా బహిష్కరించనున్నారు! తాజాగా ఓ మీడియా కథనం ఈ విషయాలను వెళ్లడించింది.
ఈ సందర్భంగా ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం... ఉమ్రా వీసా కింద గల్ఫ్ దేశంలోకి పాకిస్థానీ బిచ్చగాళ్లు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ సౌదీ హజ్ మంత్రివ శాఖ.. పాకిస్థాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు... పాక్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ "ఉమ్రా చట్టం" తీసుకురావాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఉమ్రా ఏర్పాట్లు చేసే ట్రావెల్ ఏజెన్సీలను నియంత్రించడం.. వాటిని చట్టపరమైన పర్యవేక్షణలోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుందని అంటున్నారు. సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయీద్ అహ్మద్ అల్ మాలికీతో సమావేశమైన ఇంటర్నల్ మినిస్టర్ మొహ్సీన్ నఖ్వీ.. సౌదీకి బిచ్చగాళ్లను పంతుతున్న మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కాగా... ఈ ఏడాది మే లో సౌదీ ప్రభుత్వం అనుమతి లేకుండా హజ్ చేయడాన్ని నిషేదిస్తూ ఫత్వా జారీ చేసింది. ఇది ఉల్లంఘించినవారికి 10,000 రియాల్స్ (సుమారు రూ.2.22 లక్షలు) జరిమానా, బహిష్కరణ నిర్ణయించింది.