ఇజ్రాయెల్- హెజి బొల్లా దాడి లో మరో కీలక నేత మృతి.. పశ్చిమ ఆసియా లో తీవ్ర ఉద్రిక్తత..
తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ కు చెందిన మరొక కీలక నేత మృతి చెందారు.
ఇజ్రాయెల్- హెజి బొల్లాల మధ్య దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ కు చెందిన మరొక కీలక నేత మృతి చెందారు. ఆయనతో పాటు ఆయన కుటంబం కూడా మరణించినట్లు సమాచారం.ఉత్తర లెబనాన్,ట్రిపోలిలోని పాలస్తీనా శరణార్థుల
శిబిరంపై తాజగా ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకు పడింది.
ఈ దాడుల్లో హమాస్కు చెందిన అల్ ఖసమ్ బ్రిగేడ్
సాయుధ విభాగ సభ్యుడు సయీద్ అతల్లా,అతని కుటుంబం సభ్యులు మృతి చెందారు. ఇజ్రాయిల్ కు చెందిన పలు వార్తా సంస్థలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. అక్కడి కథనాలు ప్రకారం హమాస్ మిలిటెంట్ గ్రూపుల్లోని మరొక కీలక నేత మరణించారు.
లెబనాన్లో ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుమారు 2 వేల మందికిపైగా మరణించినట్లు అంచనా. మరణించిన వారిలో 250 మందికి పైగా హెజొల్లాకు చెందినవారు కావడం గమనార్హం. మూడు నెలల క్రితం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడి లో
హమాస్ తరఫున అప్రకటిత ప్రధాని రావీ ముష్తాహా మరణించారు .
ముష్తాహాను లక్ష్యంగా చేసుకొని ఐడీఎఫ్ దళాలు చేసిన దాడి లో హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్ లీడర్ సమీ అల్ సిరాజ్, జనరల్ సెక్యూరిటీ
చీఫ్ సమి ఒదేహ్ మరణించారు. వీరు ఒక సొరంగలో దాక్కొని ఉన్నట్లు ఖచ్చితమైన సమాచారం తో ఇజ్రాయెల్ దళాలు ఫైటర్ జెట్ల సాయంతో దాడి చేశాయి.
ఇప్పటికే ఇకబీరుట్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇరాన్ 180 క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకు పడింది. అయితే ఇజ్రాయిల్ ప్రతీకార దాడులకు సై అంటున్న నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తత నెలకొంది.