మహిళా ఓటర్లు ఎక్కువ.. తక్కువగా ఉండే రాష్ట్రాలివే!

తాజాగా ఎన్నికల సంఘం రాష్ట్రాల వారీగా ఓటర్ల వివరాల్ని విడుదల చేసింది. ఈ క్రమంలో ఆ వివరాలతో ఈ నివేదికను సిద్ధం చేశారు.

Update: 2025-01-22 06:30 GMT

దేశంలోని మహిళా ఓటర్లకు సంబంధించిన ఆసక్తికర వివరాలతో ఎస్ బీఐ రీసెర్చ్ రిపోర్టు విడుదలైంది. ఇందులో రాష్ట్రాల వారీగా వెల్లడైన వివరాల్ని చూసినప్పుడు పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండే రాష్ట్రాలు మాత్రమే కాదు.. పురుష ఓటర్లకు చాలా తక్కువగా మహిళా ఓటర్లు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. తాజాగా ఎన్నికల సంఘం రాష్ట్రాల వారీగా ఓటర్ల వివరాల్ని విడుదల చేసింది. ఈ క్రమంలో ఆ వివరాలతో ఈ నివేదికను సిద్ధం చేశారు.

పురుష ఓటర్లు.. మహిళా ఓటర్లకు మధ్య ఉన్న తేడాలు షాకిచ్చేలా ఉండటం గమనార్హం. దేశంలోని 12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఐదు రాష్ట్ట్రాల్లో మాత్రం పురుష ఓటర్లు మహిళా ఓటర్లు సమానంగా ఉన్నారు. కేరళ.. అరుణాచల్ ప్రదేశ్ లలో ప్రతి వంది మంది పరుష ఓటర్లకు 109 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మేఘాలయ.. మణిపూర్.. గోవా రాష్ట్రాల్లో ప్రతి వంద మంది పురుష ఓటర్లకు 108 మంది.. ఏపీలో ప్రతి వంద మంది పురుష ఓటర్లకు 103 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

దేశ రాజధాని ఢిల్లీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే గుజరాత్ రాష్ట్రాల్లో మాత్రం ప్రతి వంది మంది పురుష ఓటర్లకు కేవలం 84 మంది మాత్రమే మహిళా ఓటర్లు ఉన్నట్లుగా రిపోర్టు వెల్లడించింది. దేశం మొత్తమ్మీదా చూస్తే పురుష ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. దేశం మొత్తమ్మీదా పురుష ఓటర్లు వర్సెస్ మహిళా ఓటర్ల లెక్కను చూస్తే.. ప్రతి వంద మంది పురుష ఓటర్లకు 95 మంది మహిళా ఓటర్లు ఉండటం గమనార్హం.

పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండే టాప్ 5 రాష్ట్రాలు.. అదే సమయంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అత్యంత తక్కువగా ఉండే ఐదు రాష్ట్రాల్ని చూస్తే..

ప్రతి వంద మంది పురుష ఓటర్లకు మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండే టాప్ 5 రాష్ట్రాల్ని చూస్తే..

రాష్ట్రం మహిళా ఓటర్లు

అరుణాచల్ ప్రదేశ్ 109

కేరళ 109

గోవా 108

మేఘాలయ 108

మణిపూర్ 108

అతి తక్కువగా మహిళా ఓటర్లు ఉండే ఐదు రాష్ట్రాలు

ఢిల్లీ 84

హర్యానా 84

గుజరాత్ 84

మహారాష్ట్ర 86

మధ్యప్రదేశ్ 88

రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ప్రతి వంద మంది పురుష ఓటర్లకు 103 మంది మహిళా ఓటర్లు ఉంటే.. తెలంగాణలో మాత్రం ప్రతి వంద మంది పురుష ఓటర్లకు వంద మంది మహిళా ఓటర్లు ఉండటం విశేషం. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లోనే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న విషయం కనిపిస్తుంది.

Tags:    

Similar News