2024 ఉష్ణోగ్రతలపై శాస్త్రవేత్తల ఆసక్తికర విషయాలు!

ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడైన సంవత్సరంగా నిలిచేలా కనిపిస్తోందని అంటున్నారు.

Update: 2024-07-10 02:30 GMT

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో వేడి పెరిగిపోతుందనే ఆందోళన పర్యావరణ వేత్తలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ వార్మింగ్ అనేది ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సమస్య అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఏడాది ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడైన సంవత్సరంగా నిలిచేలా కనిపిస్తోందని అంటున్నారు.

అవును... ఈ ఏడాది ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడైన సంవత్సరంగా నిలిచేలా కనిపిస్తోందని అంటున్నారు. గత నెల జూన్ లో అత్యంత హాటెస్ట్ జూన్ గా ఉందని ఐరోపా సమాఖ్య పర్యావరణ పరిశీలన శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అసాధారణమైన ఉష్ణోగ్రతల పరంపరను కొనసాగిస్తూ 2024ని ప్రపంచంలోనే అత్యధికంగా నమోదు చేయబడిన ఏడాదిగా కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

1800ల మధ్యకాలంలో ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత రికార్డులు ప్రారంభమైనప్పటి నుండి 2024ను 2023 కంటే అత్యంత వెచ్చని సంవత్సరంగా మారేందుకు దాదాపు 95% అవకాశం ఉందని తాను ఇప్పుడు అంచనా వేస్తునంట్లు బర్కిలీ ఎర్త్‌ లోని పరిశోధనా శాస్త్రవేత్త జెక్ హౌస్‌ ఫాదర్ అన్నారు. ఇదే సమయంలో... మారిన వాతావరణం ఇప్పటికే 2024 లో ప్రపంచవ్యాప్తంగా వినాశకరమైన పరిణామాలను ఆవిష్కరించిందని చెబుతున్నారు.

ఇదే క్రమంలో... గత నెలలో హజ్ యాత్ర సందర్భంగా 1,000 మందికి పైగా ప్రజలు తీవ్రమైన వేడికి మరణించారు.. న్యూ డెహ్లీలో హీట్ డెత్ లు నమోదయ్యాయనే విషయాన్ని గుర్తు చేస్తూ... 2024 అత్యంత హాటెస్ట్ ఇయర్ గా నమోదయ్యే అధిక అవకాశం ఉందని లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ గ్రాంథం ఇనిస్టిట్యూట్ లోని వాతావరణ శాస్త్రవేత్త ఫ్రైడెరిక్ ఒట్టో తెలిపారు.

ఇదే సమయంలో... "ఎల్నినో అనేది సహజంగా సంభవించే దృగ్విషయం.. ఇది ఎల్లప్పుడూ వస్తూ ఉంటుంది. అయితే.. మేము ఎల్ నినోను ఆపలేము కానీ చమురు, గ్యాస్, బొగ్గును కాల్చడం ఆపగలము అమ్ని ఆమె తెలిపారు. శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల వెలువడే గ్రీన్‌ హౌస్ వాయు ఉద్గారాలే ఈ స్థాయిలో వాతావరణ మార్పులకు ప్రధాన కారణం అని తెలిపారు.

Tags:    

Similar News