ఏకాకి తనంపై శాస్త్రవేత్తల షాకింగ్ విషయాలు!
ఒంటరితనంతో మానసిక సమస్యలు వస్తాయనే కామెంట్లు వినిపించిన వేళ.. సరికొత్త విషయాలు వెల్లడించారు శాస్త్రవేత్తలు.
ఒంటరితనం శాపం అని ఒకరంటే.. కాదు కాదు ఏ తలపోటూ లేకుండా ఒంటరిగా బ్రతకడం అనేది ఓ వరం అని మరికొంతమంది చెబుతుంటారు. ఈ విషయంలో ఎవరి అనుభవాలు వారికి ఉంటాయని అంటారు. అయితే... సామాజికంగా ఒంటరితనాన్ని అనుభవించేవారికి సంబంధించి ఓ షాకింగ్ విషయం వెల్లడించారు శాస్త్రవేత్తలు.
అవును... ఒంటరితనంతో మానసిక సమస్యలు వస్తాయనే కామెంట్లు వినిపించిన వేళ.. సరికొత్త విషయాలు వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగా... సామాజికంగా ఒంటరితనాన్ని అనుభవించేవారికి తీవ్రమైన వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందని గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా... సామాజికంగా ఒంటరితనాన్ని అనుభవించేవారిలో స్ట్రెస్ స్పందనగా ఉత్పత్తి అయ్యే అధిక కొలెస్ట్రాల్ తో ముడిపడిన ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నాయని తేల్చారు. ఇవి పెరగడానికి ఒంటరితనమే కారణమై ఉండొచ్చని స్పష్టం అవుతోందని తెలిపారు. ఈ మేరకు బ్రిటన్ లోని కేంబ్రిడ్జ్, చైనాలోని ఫుడాన్ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
ఈ పరిశోధనలో భాగంగా సుమారు 42 వేల మంది బ్లడ్ శాంపుల్స్ ని పరిశీలించిన శాస్త్రవేత్తలో అందులో ఉన్న వివిధ రకాల ప్రోటీన్ల మోతాదును విశ్లేషించారు. వీరిలో ప్రధానంగా ఒంటరితనం అనుభవిస్తున్నవారిలో ఎటువంటి ప్రోటీన్లు ఉన్నాయనే విషయాన్ని శోధించే ప్రయత్నం చేశారు. వీరిలో వైరల్ ఇన్ ఫెక్షన్ కు స్పందనగా ఉత్పత్తయ్యే ప్రోటీన్లే ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.
ఇదే సమయంలో... టైప్-2 మధుమేహం, గుండె జబ్బు, పక్షవాతంతో ముడిపడిన ప్రోటీన్లు కూడా వీరిలో ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో... కుటుంబ సభ్యులు, స్నేహితులతో మంచి సంబంధాలను కలిగి ఉండటం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చని వారు పేర్కొన్నారు.
అందువల్ల సామాజికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నవారు కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ మంచి సంబంధాలు కలిగి ఉండటం వల్ల రోగ నిరోధక వ్యవస్ర్థను మెరుగుపరచుకోవచ్చని.. తీవ్రమైన ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.