సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళుతున్నారా? మిస్ కావొద్దు

హైదరాబాద్ మహానగరంలోని వారు మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతి కుటుంబానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో అనుబంధం ఉంటుంది.

Update: 2025-02-19 06:13 GMT

హైదరాబాద్ మహానగరంలోని వారు మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతి కుటుంబానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో అనుబంధం ఉంటుంది. తాజాగా ఈ రైల్వే స్టేషన్ ను పెద్ద ఎత్తున డెవలప్ చేస్తున్నారు. సుమారు రూ.720 కోట్ల అంచనాలతో భారీ ఎత్తున ఈ రైల్వేస్టేషన్ ను డెవలప్ చేస్తున్నారు.మరో రెండేళ్ల వ్యవధిలో వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ గా మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ ఎత్తున పనులు చేపట్టారు. ఈ క్రమంలో ఈ స్టేషన్ కు ఎంట్రీ విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో ఏ మాత్రం అప్డేట్ కాకున్నా.. ఇబ్బందులకు గురి కాక తప్పదు. అందుకే.. తాజాగా చేసిన మార్పులు.. స్టేషన్ లోకి వెళ్లేందుకు వెళ్లే మార్గాల గురించి అవగాహన పెంచుకోవటం చాలా అవసరం. తాజాగా చేసిన మార్పుల ప్రకారం స్టేషన్ లోకి ఎలా వెళ్లాలి? ఎలా బయటకు రావాలి? అన్న విషయంలోకి వెళితే..

- ప్లాట్‌ఫామ్ నెం.1కి గణేష్ ఆలయం పక్కన కొత్త ప్రవేశ ద్వారం తెరిచారు. జనరల్ బుకింగ్ కౌంటర్, విచారణతో పాటు 750 మంది ప్రయాణీకులు వెయిట్ చేసేందుకు వీలుగా 500 అదనపు సీటింగ్ సామర్థ్యంతో కొత్త వెయిటింగ్ హాల్‌ను ఏర్పాటు చేశారు.

- గేట్ నంబర్ 4 మూసివేశారు. స్వాతి హోటల్ ఎదురుగా ఉన్న చోట కొత్త ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేశారు.

- ప్లాట్‌ఫామ్ నంబర్ 10 లో భోయిగూడ వైపు ఉండే ప్రవేశ ద్వారం వద్ద జనరల్ బుకింగ్ తోపాటు.. కొత్త ప్రవేశం ద్వారం తెరిచారు.

- స్టేషన్ లో ఎంట్రీ.. ఎగ్జిట్ మార్గాలు.. ప్లాట్ ఫారాలు గుర్తించేందుకు వీలుగా కొత్త సైన్ బోర్డుల్ని ఏర్పాటు చేవారు. ఫుట్ఓవర్ బ్రిడ్జిలపైనా సైన్ బోర్డుల్ని ఏర్పాటు చేవారు.

- రైళ్ల రాకపోకలకు సంబంధించిన వివరాల్ని ముందుగానే ఫ్లాట్ ఫారమ్ 1, 10లలో ముందుగానే డిస్ ప్లే చేస్తున్నారు. అదనపు సమాచారం కోసం 139ను సంప్రదించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.

Tags:    

Similar News