క్యాపిటల్ సెనేట్ లోకి ఆగంతుకుడు? హైరానా పడ్డ అగ్రరాజ్యం
వాషింగ్టన్ డీసీ లో చోటు చేసుకుంది. పాలనా పరంగా కీలకమైన క్యాపిటల్ సెనేట్ భవనాల్లో ఆయుధాలతో కూడిన ఆగంతకుడు ఒకరు ప్రవేశించారన్న మాట
ఒక సమాచారం అగ్రరాజ్యం అమెరికా ను హైరానా కు గురి చేసింది. ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితులతో.. వాస్తవం ఏమిటో నిగ్గు తేల్చే వరకు ఏం చేయాలో తోచని పరిస్థితి తాజాగా చోటు చేసుకుంది. ఇదంతా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ లో చోటు చేసుకుంది. పాలనా పరంగా కీలకమైన క్యాపిటల్ సెనేట్ భవనాల్లో ఆయుధాలతో కూడిన ఆగంతకుడు ఒకరు ప్రవేశించారన్న మాట.. వణుకు పుట్టేలా చేసింది.
దీంతో.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సెనేట్ కార్యాలయాల్ని తమ అధీనం లోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అత్యంత భద్రతో కూడిన రస్సెల్ భవనంతో పాటు ఇతర సెనెట్ భవనాల్లోనూ పెద్దఎత్తున గాలింపు చర్యల అనంతరం.. తమకు వచ్చిన సమాచారంలో నిజం లేదని తేల్చుకున్న తర్వాత కానీ ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి.
అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల వేళలో ఆయుధాలతో కూడిన ఒక వ్యక్తి సెనేట్ కార్యాలయాల్లో సంచరిస్తున్నాడన్న సమాచారాన్ని 911 నెంబర్ కు ఫోన్ చేసి చెప్పారు. క్షణాల్లో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే.. అక్కడున్న వారిని సురక్షిత ప్రాంతాల కు తరలించటంతో పాటు.. పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు.
క్యాపిటల్ పోలీసులు ఒక ట్వీట్ చేస్తూ.. క్యాపిటల్ సెనేట్ ఆఫీసుల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు.. సమీప ప్రాంతాలకు ఎవరూ రావొద్దని కోరారు. అయితే తమకు వచ్చిన సమాచారం లో నిజం లేదని తేలిన తర్వాత కానీ టెన్షన్ ఫ్రీ కాలేదు. ఏమైనా అగ్రరాజ్యాన్ని కాసేపు హైరానా కు గురి చేసిన సదరు వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు.