అదరగొట్టేసిన శంషాబాద్ ఎయిర్ పోర్టు.. తాజా రికార్డు ఇదే

దేశంలోని అగ్రశ్రేణి ఎయిర్ పోర్టుల కంటే మిన్నగా ఫెర్ ఫార్మ్ చేస్తుంది.;

Update: 2025-04-08 08:30 GMT
New Record For RGIA ShamshaBad

దేశంలోని ప్రధాన విమానాశ్రయాలతో పోటీ పడుతోంది శంషాబాద్ ఎయిర్ పోర్టు. అంతేకాదు.. అంతకంతకూ దూసుకెళుతున్న ఈ ఎయిర్ పోర్టు గడిచిన ఆర్థిక సంవత్సరంలో మహా జోరును ప్రదర్శించింది. ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తూ.. చరిత్రను స్రష్టిస్తోంది. దేశంలోని అగ్రశ్రేణి ఎయిర్ పోర్టుల కంటే మిన్నగా ఫెర్ ఫార్మ్ చేస్తుంది.

గత ఆర్థిక సంవత్సరం (1 ఏప్రిల్ 2024 - 31 మార్చి 2025)లో ఏకంగా 15.20 శాతం వృద్ధిసాధించి.. మిగిలిన అగ్రశ్రేణి ఎయిర్ పోర్టుల కంటే మిన్నగా నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణికులు ఈ ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు సాగించారు. ఇదే రద్దీ కంటిన్యూ అయితే.. ఈ ఆర్థిక సంవత్సరంలో 3 కోట్ల ప్రయాణికుల మార్కును దాటేయటం ఖాయమంటున్నారు.

గడిచిన ఆర్థిక సంవత్సరంలో చివరి మూడునెలలు (జనవరి - మార్చి) దేశీయ.. అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లో శంషాబాద్ ఎయిర్ పోర్టు అరుదైన ఘనతను సాధించింది. ఇక్కడి నుంచి నెలకు గరిష్ఠంగా 20 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణాలు చేస్తుంటారు సాధారణంగా.అందుకు భిన్నంగా మూడు నెలల్లో ఏకంగా 74 లక్షల మంది ప్రయాణించటం ద్వారా సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది.

జనాభాలో హైదరాబాద్ కంటే ఎక్కువగా ఉండే.. చెన్నై.. కోల్ కతా నగరాల కంటే ఎక్కువ రద్దీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఉండటం విశేషం. అంతేకాదు.. రోజువారీ గరిష్ఠ ప్రయాణికుల రికార్డును కూడా బద్ధలు కొట్టేసింది. సాధారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు గరిష్ఠ ప్రయాణికలు సంఖ్య రోజులో 75 వేలు. అయితే.. జనవరి 18న ఆ రికార్డును బ్రేక్ చేస్తూప. ఏకంగా 94 వేల మంది ప్రయాణికులు ఒక్కరోజులో ప్రయాణించటం విశేషం.

ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు మాత్రమేకాదు.. మహారాష్ట్ర.. కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు తమ విదేశీ ప్రయాణాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టును ఎంచుకోవటం విశేషం. ఈ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు ఎక్కువగా వెళ్లే ప్రాంతాల్ని చూస్తే.. దుబాయ్.. దోహా.. అబుదాబి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. దుబాయ్ కు నెలకు 93 వేల మంది.. దోహాకు నెలకు 42 వేల మంది .. అబుధాబీకి నెలకు 38 వేలు.. జెడ్డాకు నెలకు 31 వేలు.. సింగపూర్ కు నెలకు 31 వేల మంది ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నట్లుగా వెల్లడైంది.

Tags:    

Similar News