మళ్ళీ బ్యాలెట్ ఎన్నికలకు వెళ్దామా ?

దేశంలో అన్నీ ముందుకు సాగుతున్నాయి. టెక్నాలజీని విరివిగా వాడేసుకుంటున్న దేశం మనది.

Update: 2024-12-08 15:38 GMT

దేశంలో అన్నీ ముందుకు సాగుతున్నాయి. టెక్నాలజీని విరివిగా వాడేసుకుంటున్న దేశం మనది. ఒకపుడు పక్క ఊరుకు ఫోన్ చేయాలన్నా ట్రంకాలు బుక్ చేసుకుని వేచి ఉండి ఆనక మాట్లాడే పరిస్థితి. ఇపుడు చేతిలో స్మార్ట్ ఫోన్. అమెరికాలో ఉన్న మాట్లాడే చాన్స్. కేవలం ఇదే కాదు అన్ని రంగాలల్లోనూ మార్పులు వచ్చేశాయి.

ఈ క్రమలోనే గత రెండు దశాబ్దాలుగా దేశంలో ఈవీఎంల ద్వారా పోలింగ్ జరుగుతోంది. ఈవీఎంలు వచ్చిన కొత్తలో అదొక మోజుగా చూశారు. వెంటవెంటనే ఫలితాలు రావడంతో అంతా సంబరపడ్డారు. బ్యాలెట్ పేపర్ వల్ల రెండు మూడు రోజుల పాటు ఫలితాలు లెక్కించడంతో ఉన్న టెన్షన్ పోయిందని ఫుల్ రిలీఫ్ ఫీల్ అయ్యారు.

అయితే అది కాస్తా ఇపుడు రివర్స్ అవుతోంది. గెలుపు ఓటములు జనాలు డిసైడ్ చేయడం లేదని ఈవీఎంలలోనే మహిమ ఉందని ఓడిన పార్టీలు భావిస్తున్నాయి. అది ఎంతవరకూ వెళ్ళింది అంటే తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి బంపర్ విక్టరీ కొట్టింది విపక్షానికి విపక్ష హోదా లేకుండా సీట్లను ఊడ్చి పారేసింది.

దాంతో మరోమారు ఈవీఎంల మీద చర్చ మొదలైంది. అసలు ఇంతలా థంపింగ్ మెజారిటీ ఎలా బీజేపీ నాయకత్వం లోని కూటమికి వస్తుంది అంటూ అంతా డౌట్లు వెలిబుచ్చుతున్నారు. అంతే కాదు ఈవీఎంలలో ఏదో జరిగిందని అక్కడ మహా వికాస్ ఘాడీ నేతలు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి కూడా విపక్షాలు బాయ్ కాట్ చేయడానికి ఇదే కారణం.

ఈ నేపధ్యంలో మరాఠా యోధుడు దిగ్గజ నేత శరద్ పవార్ అయితే అభివృద్ధి చెందిన దేశాలలో లేని ఈవీఎంలు ఒక్క భారత్ లోనే ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు ఈవీఎంలను ఏదో చేసి గెలిచారు అన్న భావన మహారాష్ట్ర ప్రజలలో ఉందని ఆయన అతి పెద్ద ఆరోపణే చేశారు. ఈవీఎంల మీద ప్రజలకు నమ్మకం లేదని అయినా ఎన్నికల్లో ఓటింగ్ కి పాల్గొన్నారు అని ఆయన ఆసక్తికరమైన చర్చనే ముందు పెట్టారు.

అంతకు ముందు ఇదే రకమైన వాదన ఏపీలో వైసీపీ వ్యక్తం చేసింది. 2019లో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తం చేశారు. రీసెంట్ గా హర్యానా ఎన్నికల్లో ఓటమి తరువాత కాంగ్రెస్ వ్యక్తం చేసింది. ఇలా ఓడిన పార్టీలు అన్నీ ఈవీఎంలను నిందించడం జరుగుతోంది. అదే గెలిచిన పార్టీలు మాత్రం ఈవీఎంల ఊసే ఎత్తడం లేదు.

అంటే ఈవీఎంల ద్వారా గెలుపు దక్కితే ఓకే. ఓడితేనే ఈ సమస్య అన్నది కూడా జనాలలో చర్చ వస్తొంది. మరి గెలిచాక కూడా ఈవీఎంలదే తప్పు అక్కడ ఏదో పొరపాటు ఉందని అంటే వాలీడ్ పాయింట్ అని జనాలు అనవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే నిజమే శరద్ పవార్ చెప్పినట్లుగా అభివృద్ధి చెందిన దేశాలలో ఈవీఎంల వాడకం ఉండక పోవచ్చు.

కానీ అక్కడ ఈవీఎంలను అనుమానంతో వాడడం లేదా లేక వేరే కారణాలా అన్నది తెలియడం లేదు. మరో వైపు చూస్తే ఆయన దేశాల జనాభా కూడా తక్కువ. భారత్ లో వంద కోట్లకు తక్కువ లేకుండా ఓటర్లు ఉన్నారు. అంతకంతకు వారు పెరుగుతున్నారు. అలాంటపుడు ఈవీఎంలతోనే ఎన్నికలు పెడితే అయ్యే దానికీ బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలకు అయ్యే ఖర్చు కూడా చూసుకోవాల్సి ఉంది.

బ్యాలెట్ పేపర్ మీద పోనీ ఏమైనా పద్ధతిగా ఎన్నికలు సాగుతాయా అంటే పోలింగ్ బూతులను ఆక్రమించి ఓట్లు గుద్దుకోవడం, తమకు నచ్చని పార్టీలకు ఓట్లు వేస్తే ఆ బాక్సులను తెచ్చి బావులలో గోతులలో వేయడం కూడా గతంలో జరిగిన సంఘటనలు చూసారు. అదే ఈవీఎంలలో అయితే వాటిని ధ్వంసం చేసినా అందులో కంటెంట్ మాత్రం అలాగే ఉంటుంది. ఇది ప్లస్ పాయింట్.

ఇక ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చు అని అంటున్నారు. మరి దానిని ఇప్పటిదాకా నిరూపించడం అయిఎత చేయలేదు అంటున్నారు. దానిని నిరూపించి ఈసీ ముందే ఒక లైవ్ డెమో ఇస్తే అపుడు ఏమైనా ఆలోచించవచ్చు అన్నది కూడా ఒక మాటగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే గెలుపు ఎవరికైనా తీపే. ఓటమి మాత్రం చేదు.

ఇపుడు దానికి దొరికిన అనేక కారణాలలో ఈవీఎంలను కూడా కలుపుతున్నారా అంటే ఏమో అన్న మాట ఉంది. అయితే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు అనుమానాలు ఉండరాదు. అంతా ఒక మాట మీదకు వచ్చి బ్యాలెట్ పేపర్ విధానం రావాలని కోరితే అపుడు దానిని అమలు చేసినా తప్పు అయితే లేదు. ఏది ఏమైనా అంతిమంగా కచ్చితమైన ప్రజా తీర్పు రావడమే ప్రజాస్వామ్యానికి ఎప్పటికీ శ్రీరామరక్షగా ఉంటుంది అన్నది నిజం.

Tags:    

Similar News