నేపాల్ లో పడిపోయిన ప్రభుత్వం... కారణం ఇదే!

అవును... నేపాల్ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-07-12 16:41 GMT

నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... తాజాగా ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ ఓటమి పాలయ్యారు. ఈ సమయంలో 275 సీట్లు కలిగిన నేపాల్ పార్లమెంట్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 138 ఓట్ల మెజారిటీ అవసరం ఉండగా... అందులో సగం కూడా ప్రచండ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడకపోవడం గమనార్హం.

అవును... నేపాల్ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా అవిశ్వాస తీర్మానంలో ప్రస్తుత ప్రధాని ఓటమి పాలయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఓటింగ్ లో ప్రభుత్వానికి కేవలం 63 మంది మాత్రమే మద్దతుగా నిలవగా.. వ్యతిరేకంగా 194 ఓట్లు పోలవ్వడం గమనార్హం. ఈ అంకెలే చెబుతున్నాయి.. ప్రస్తుత ప్రభుత్వంపై, ప్రధానిపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందనేది!

కాగా... 2022 డిసెంబర్ 25న నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ దహల్ ప్రచండ బాధ్యతలు స్వీకరించారు. ఇందులో భాగంగా... మాజీ ప్రధాని ఓలీ నేతృత్వంలోని కమ్యునిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ యునిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్-యూఎంఎల్) తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే తాజాగా మాజీ ప్రధాని కేపీ శర్మ నేతృత్వంలోని పార్టీ.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిచుకోవడంతో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోయినట్లయ్యింది.

వాస్తవానికి నేపాలీ కాంగ్రెస్ తో ప్రభుత్వం ఏర్పాటు సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం అధికార బదలాయింపు జరగాల్సి ఉంది. అంటే... కమల్ దహల్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ... ఆయన అందుకు నిరాకరించారు. దీంతో అవిశ్వాసం అనివార్యమైంది. దీంతో... నేపాలీ కాంగ్రెస్ పార్టీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా.. సీపీఎన్-యూఎంఎల్ కు 78 సీట్ల బలం ఉంది!

దీంతో త్వరలో వీరిద్దరూ కలిసి మరో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ఫలితంగా తదుపరి ప్రధానిగా సీపీఎన్-యూఎంఎల్ నేత ఓలీ ప్రమాణస్వీకరం చేసి బాధ్యతలు చేపట్టనున్నారు. అందుకు నేపాలీ కాంగ్రెస్ అంగీకారం కూడా తెలిపిందని అంటున్నారు.

Tags:    

Similar News