టీడీపీ కూటమిని శభాష్ అంటున్న షర్మిల!
అలా సోషల్ మీడియాలో సైకోల బాధితులలో తాను కూడా ఉన్నాను ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సైకోల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉన్న కడప జిల్లాకు చెందిన వర్రా రవీంద్ర రెడ్డి అరెస్ట్ ని సమర్ధించారు. ఆయన అరెస్ట్ తో టీడీపీ కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని ఆమె అంటున్నారు.
సోషల్ మీడియా ద్వారా కొందరు సైకోలు తల్లీ చెల్లెలు అన్న తేడా లేకుండా పోస్టులు పెట్టారని ఆమె నిప్పులు చెరిగారు. కొందరు సైకోలు సైకో పార్టీలు అంటూ ఆమె డైరెక్ట్ గానే వైసీపీని ఎటాక్ చేశారు. ఏకంగా తన ఇంటి పేరునే మార్చేశారు అని ఆమె ఫైర్ అయ్యారు.
అంతే కాదు తాను వైఎస్సార్ కి పుట్టలేదని ప్రచారం కూడా చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మానవ సంబంధాలు రక్త సంబంధాలు మరచి మృగాలు మాదిరిగా మారారని ఆమె నిప్పులు చెరిగారు. సమాజంలో ప్రశ్నించే మహిళల మీద అసభ్య పోస్టులు పెట్టి రాక్షసానందం పొందారని ఆమె ఘాటు విమర్శలే చేశారు.
అలా సోషల్ మీడియాలో సైకోల బాధితులలో తాను కూడా ఉన్నాను ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సైకోల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. దారుణమైన పోస్టులు పెట్టిన వారు ఏ పార్టీలో ఉన్నా అరెస్ట్ చేయాలని షర్మిల అంటున్నారు.
ఇదిలా ఉంటే తన తల్లి విజయమ్మ రాసిన లేఖ కూడా ఫేక్ అని ప్రత్యర్ధి పార్టీలు అధికారిక ట్విట్టర్ ద్వారానే ట్వీట్లు పెట్టారని వైసీపీ చీఫ్ జగన్ మరో వైపు చెప్పారు. రెండేళ్ల క్రితం తన తల్లి కారుకు యాక్సిండెంట్ అయితే దానికీ తనకూ ముడిపెడుతూ తప్పుడు పోస్టులు పెట్టారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరి జగన్ తల్లి అంటే షర్మిలకు కూడా తల్లి అని టీడీపీ లో అలా పోస్టింగులు పెట్టిన వారి మీద కూడా చర్యలకు షర్మిల డిమాండ్ చేయాలని మరో వైపు వినిపిస్తోంది. అదే విధంగా 2014 నుంచి 2019 దాకా వైసీపీ తరఫున నాయకురాలిగా ఉన్న షర్మిల విషయంలో నాడు టీడీపీ వారు అనుచితమైన పోస్టింగులు సోషల్ మీడియాలో పెట్టిన సంగతిని కూడా గుర్తు చేస్తున్నారు.
ఏది ఏమైనా ఎవరు బాధితురాలుగా ఉన్నా కూడా చర్యలు తీసుకునేలా కఠిన చట్టాలు ఉండాలని అటున్నారు. తాజాగా హోం మంత్రి అనిత దీని మీద మీడియాతో మాట్లాడుతూ మహిళ ఎక్కడైనా మహిళే అని అన్నారు. అందువల్ల పార్టీలకు అతీతంగా అందరి మీద చర్యలు తీసుకుంటే కచ్చితంగా సోషల్ మీడియా పోస్టింగులలో గణనీయమైన మార్పులు వస్తాయని అంటున్నారు.
రాజకీయాల్లో కానీ ఏ రంగంలో కానీ భిన్న అభిప్రాయాలకు మంచి భాష ఉంటుందని దానిని అందరూ వాడేలా ఉండాలని అంటున్నారు. సో ఇకనైనా అంతా ఆ దిశగా వ్యవహరించేలా చూడాల్సి ఉంది. మొత్తానికి చూస్తే షర్మిలను బాధపెట్టిన రవీంద్రరెడ్డిని అరెస్ట్ చేశారు. మరింతమంది ఆడబిడ్డలను బాధపెట్టిన వారిని కూడా అరెస్టులు చేస్తే కూటమి సర్కార్ ని శభాష్ అని అంతా అంటారు అని అంటున్నారు.