షర్మిలపై అధిష్టానం ఆగ్రహం.. పని మొదలెట్టేసినట్టేనా..?
ఈ నేపథ్యానికి తోడు తాజాగా వెలుగులోకి తీసుకువచ్చిన ఆస్తుల వివాదం మరింతగా ఆమెను ఇబ్బంది పెట్టింది. వ్యక్తిగతంగా ఆమె సాధించింది ఏమైనా ఉంటే ఉండొచ్చు.
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల వ్యవహారం.. కాంగ్రెస్ పార్టీలో ఆసక్తిగా మారిన విషయం తెలిసిందే. పార్టీని బాగు చేస్తారని, ఓటు బ్యాంకును పెంచుతారని, పడిపోయిన పార్టీని నిలబెడతారని భావించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏరికోరి షర్మిలను పార్టీలోకి తీసుకుం ది. వైఎస్ వారసత్వాన్ని, ఆయన సింపతీని తమకు అనుకూలంగా మారుస్తారనికూడా ఆశలు పెట్టుకుంది. అయితే.. అనుకు న్న విధంగా షర్మిల దూకుడు చూపించలేకపోతున్నారు. కేవలం సొంత అజెండాను ఏర్పాటు చేసుకుని ముందుకు పోతున్నా రు. ఈ విషయంపై సీనియర్ నాయకులు, ముఖ్యంగా అధిష్టానంతో టచ్‌లో ఉన్న నాయకులు ఈ విషయాన్ని తప్పుబడుతున్నారు.
ఎందుకంటే.. వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వం.. అంటే.. కేవలం మాటలతో వచ్చేది కాదు. ఆయన లేనిలోటును ప్రజలకు తీర్చే నాయకత్వం అవసరం. ఈ విషయంలోనే జగన్ సంక్షేమ పథకాలను ఎక్కువగా అమలు చేసి.. వైఎస్ వారసత్వాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఎన్నికల్లో ఆయనకు మించి హామీలు గుప్పించిన కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంది. కానీ, ఆమె ఈ విషయాన్ని వదిలేశారు. కేవలం అన్నను టార్గెట్ చేయడం ద్వారా.. ఏదో సాధించాలని అనుకున్న విషయం క్షేత్రస్థాయిలో ఎక్కువగా ప్రచారం అవుతోంది.
ఈ నేపథ్యానికి తోడు తాజాగా వెలుగులోకి తీసుకువచ్చిన ఆస్తుల వివాదం మరింతగా ఆమెను ఇబ్బంది పెట్టింది. వ్యక్తిగతంగా ఆమె సాధించింది ఏమైనా ఉంటే ఉండొచ్చు. కానీ, పార్టీ పరంగా మాత్రం.. వైఎస్‌ను రోడ్డున పడేసినా.. ఎందుకు మౌనంగా ఉన్నా రన్న వాదన వినిపిస్తోంది.
ఈ క్రమంలో అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిని ప్రాతిపదికగా చేసుకుని..ఇక, షర్మిల పోస్టును మారుస్తారంటూ.. కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఇదే జరిగితే.. అసలు షర్మిలకు వేదిక కూడా లేకుండా పోతుంది. దీంతో ఆమె ముందుగానే ఈ విషయాన్ని గ్రహించారు. వెంటనే అలెర్ట్ అయ్యారు.
పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. భవిష్యత్తును వ్యూహాత్మకంగా నిర్మించే ప్రతిపాదనలు చేసుకున్నారు. ప్రజా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కేడర్‌కు ఆమె పిలుపునిచ్చారు. వచ్చే నెల నుంచి ప్రజల్లోకి వస్తానని స్వయంగా చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలపై ఫోకస్ పెంచాలని కూడా సూచించారు. అంతేకాదు.. ప్రజలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించాల న్న వ్యూహాన్ని కూడా ఆమె తెరమీదికి తెచ్చారు. మొత్తంగా చూస్తే.. షర్మిల.. అధిష్టానం ఆగ్రహం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నాలుగు అడుగులు వెనక్కి తగ్గినా.. మరో నాలుగు అడుగులు ముందుకు వేసినట్టు అయింది.