"కొంగుచాచి అడుగుతున్నాం"... వైఎస్ షర్మిళ ఆసక్తికర అభ్యర్థన!

ఏపీలో ఎన్నికల వేళ కడప లోక్ సభ సీటులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

Update: 2024-04-13 06:50 GMT

ఏపీలో ఎన్నికల వేళ కడప లోక్ సభ సీటులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తరుపున వైఎస్ షర్మిళ పోటీ చేస్తున్నప్పటినుంచీ కడప ఎంపీ సీటు పాలిటిక్స్ హీటెక్కిపోతున్నాయి. వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా షర్మిళతోపాటు వివేకానందరెడ్డి కూతురు కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పులివెందుల నియోజకవర్గ పరిధిలో ప్రచారానికి వెళ్లారు వైఎస్ షర్మిళ. ఈ సందర్భంగా ఆసక్తికర రాజకీయాలు తెరపైకి వచ్చాయి!

అవును... ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద రాజకీయాలు ఒకెత్తు.. కడప లోక్ సభ స్థానంలోని పోరు మరొకెత్తు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి! ప్రధానంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో అవినాష్ రెడ్డికి జగన్ కడప ఎంపీ టిక్కెట్ ఇవ్వడం తనకు ఏమాత్రం నచ్చలేదని.. అందుకే చిన్నాన్న కోసం తాను బరిలోకి దిగుతున్నట్లు షర్మిళ ప్రకటించారు. అప్పటి నుంచి కడప రాజకీయం మరింత కాకరేపుతోన్న పరిస్థితి!

ఈ సమయంలో శుక్రవారం నాడు... సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ప్రచారానికి వెళ్లిన పీసీసీ అధ్యక్షురాలు, కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి వైఎస్ షర్మిల, ఆమెకు మద్దతుగా కలిసి ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డిని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా... వివేకా హంతకులకు మద్దతిస్తారా, రాజశేఖర్ రెడ్డి బిడ్డకు మద్దతిస్తారా అంటూ షర్మిల చేస్తోన్న వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సమయంలో... పులివెందుల ప్రజలారా కొంగుచాచి అడుగుతున్నాం అంటూ వైఎస్ షర్మిళ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో భాగంగా... "మీ ఆడ బిడ్డలం.. కొంగుచాచి అడుగుతున్నాం. పులివెందుల ప్రజలారా.. మాకు న్యాయం చేయండి. జగన్ అన్న కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. అన్న కోసం ఇళ్ళు వాకిలి వదిలేసి తిరిగా. జగన్ అన్న ఏది చెప్తే అది చేశా" అంటూ మొదలుపెట్టిన షర్మిళ అనంతరం డోసు పెంచారు.

ఇందులో భాగంగా... జగన్ అన్న సీఎం అయితే వైఎస్సార్ సంక్షేమ పాలన వస్తుందనుకున్నా. వివేకా హత్య విషయంలో సునీత, చిన్నమ్మ బాగా నష్టపోయారు. వివేకా అంటే స్వయానా మాకు చిన్నాన్న. రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్సార్ కు వివేకా అలా. సొంత రక్త సంబంధానికి న్యాయం చేయకపోతే మనం ఎందుకు? హంతకుడు చట్టసభల్లోకి వెళ్లొద్దనే కడప నుంచి పోటీ చేస్తున్నా.. మీ ఆడ బిడ్డలం అడుగుతున్నాం. మాకు న్యాయం చేయండి" అని అభ్యర్థించారు.

దీంతో... ఈ విషయం తీవ్ర హాట్ టాపిక్ గా మారింది. ఇలా గద్గద స్వరంతో వైఎస్ షర్మిళ పులివెందుల ప్రజలకు చేసిన రిక్వస్ట్ ఏపీ రాజకీయాల్లోఈ తీవ్ర చర్చనీయాంశం అవుతోంది! ఈ నేపథ్యంలో కడప లోక్ సభ స్థానంలోనూ, పులివెందుల అసెంబ్లీ స్థానంలోనూ వైఎస్ షర్మిళ ఎలాంటి ప్రభావం చూపబోతున్నారనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News