సజ్జల రామకృష్ణారెడ్డిపై షర్మిళ స్ట్రాంగ్ వ్యాఖ్యలు!
అనంతరం వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారంపైనా వైఎస్ షర్మిళ స్పందించారు.
ఎన్నికల నేపథ్యంలో... ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్నాయి. నిన్నటి వరకూ కూటమి వర్సెస్ వైసీపీగా సాగిన పోరులోకి కాంగ్రెస్ కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిళ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టారు. ఇందులో భాగంగా బస్సుయాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఆంద్యంతం ఏపీ సర్కార్ పైనా, వైఎస్ జగన్ పైనా విరుచుకుపడుతున్నారు షర్మిళ! ఈ సందర్భంగా సజ్జలపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
అవును... బస్సుయాత్రలో భాగంగా మూడో రోజు ఆదివారం వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పర్యటించిన వైఎస్ షర్మిళ... ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇందులో భాగంగా... "నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా? నేను ఎవరిని అనుకుంటున్నవ్? రాజన్న బిడ్డని గుర్తుపెట్టుకో! అధికార మదం తలకెక్కిందా? అంటూ విరుచుకుపడ్డారు.
ఇదే సమయంలో.. "నువ్వూ.. నీ కొడుకు పేమెంట్ తీసుకుని నన్ను, సునీతను పలుమార్లు పలు విధాలుగా హింసించారు! సోషల్ మీడియాలో హేలన చేశారు. నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు" అంటూ షర్మిళ తీవ్రస్థాయిలో సజ్జల రామకృష్ణారెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు! ఇదే క్రమంలో... ఇలాంటి సజ్జలకి సలహాదారుగా నియమించడం జగన్ చేసుకున్న ఖర్మంటూ షర్మిల వ్యాఖ్యానించారు.
అనంతరం వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారంపైనా వైఎస్ షర్మిళ స్పందించారు. ఇందులో భాగంగా... వివేకా లాంటి మంచి మనిషి నేడు భూతద్దం పెట్టి వెతికినా దొరకరని చెప్పిన షర్మిళ.. అలాంటి మంచి మనిషిని నరికి చంపేశారని అన్నారు. ఇదే సమయంలో... చిన్నాన్నను చంపినవాళ్లకు, చంపించిన వాళ్లకు మధ్య ఎన్నో లావాదేవీలున్నాయని తెలిపారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ చెప్పినా కూడా ఆ నిందితుడుని జగన్ కాపాడుతున్నారని అన్నారు.
ఈ సమయంలో... చిన్నాన్న కుటుంబానికి న్యాయం చేయకపోగా.. మళ్లీ అదే మనిషికి టిక్కెట్ ఇచ్చారని చెప్పిన షర్మిళ.. ఇది అహంకరం కాపోతే మరేమిటని నిలదీశారు. ఈ అన్యాయం అడ్డుకోవడానిమే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు షర్మిల పునరుద్ఘాటించారు.