పవన్ మాట.. బాబు చేత... వైఎస్ బ్రతికుంటే అంటూ షర్మిళ కీలక వ్యాఖ్యలు!
అవును... వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేయటం లేదని ప్రకటించారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో కీలక పరిణామాలు చోటూ చేసుకుంటున్నాయి. పైగా జరుగుతున్న పరిణామాల్లో మెజారిటీ అప్ డేట్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జరుగుతున్నాయనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మొన్నటి వరకూ ఊరించి ఊరించి చివరి నిమిషంలో పలాయనం చిత్తగించారని, ఇది అత్యంత అనైతిక చర్య అని చంద్రబాబు నిర్ణయం అని కాసాని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే! దీంతో... తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అనే నిర్ణయం వెనుక కాంగ్రెస్ మేలు కోరడం ఉందనేది ఈ సందర్భంగా బలంగా వినిపించిన కామెంట్.
ప్రధానంగా సెటిలర్స్ ఓట్లు చీలిపోకుండా.. అవన్నీ కాంగ్రెస్ కు పడే విధంగా ఒకటే ఆప్షన్ ఉంచేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మరోపక్క 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి చంద్రబాబు రంగప్రవేశం కూడా ఒక కారణం అని.. నాడు కేసీఆర్ విమర్శలకు బాబు ఎంట్రీ బలం చేకూర్చిందని కామేంట్లు వినిపించాయి. ఈ క్రమంలో వైఎస్ షర్మిళ కూడా ఒక కీలక నిర్ణయం ప్రకటించారు.
అవును... వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేయటం లేదని ప్రకటించారు. తాను తొలి నుంచి రాజన్న రాజ్యం కోసంతోపాటు.. బీఆరెస్స్ ను ఓడించాలనే లక్ష్యంతో పార్టీ స్థాపించి, పని చేసానని స్పష్టం చేసారు. అయితే... మారుతున్న పరిణామాలతో తాను కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు షర్మిళ చెప్పారు. ఈ సందర్భంగా..."ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం" అని షర్మిల వెల్లడించారు.
తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలతో పాటుగా పార్టీ శ్రేణులు అర్దం చేసుకోవాలని షర్మిల కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశముందని.. ఆ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని ఈ సందర్భంగా షర్మిల చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మారే అవకాశం వచ్చినపుడు అడ్డుపడటం సరికాదని.. కేసీఆర్ అవినీతి పాలనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కు మద్దతిస్తామని ఆమె ప్రకటించారు. దీంతో.. ఏపీలో పవన్ చెబుతున్నమాటే తెలంగాణలో షర్మిళ చెబుతున్నారని అంటున్నారు పరిశీలకులు.
ఆ సంగతి అలా ఉంటే... వైఎస్సార్ బ్రతికి ఉంటే కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో ఒక కీలక పరిణామం జరిగి ఉండేదని షర్మిల చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా... తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రధాన మంత్రి అయ్యి ఉండేవారని షర్మిళ తెలిపారు. ఈ సందర్భంగా... రాజీవ్ గాంధీ కుటుంబం అంటే వైఎస్సార్ కు చాలా అభిమానం అని షర్మిళ వెల్లడించారు.
ఇదే క్రమంలో... కాంగ్రెస్ పార్టీకి సుమారు 35ఏళ్లు సేవచేసి, రెండు సార్లు అధికారంలోకి తీసుకు వచ్చారని గుర్తుచేసిన షర్మిళ... రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని మొట్టమొదటిసారిగా చెప్పింది వైఎస్సారే అని షర్మిళ తెలిపారు. అనంతరం... సోనియా, రాహుల్ లు వైఎస్సార్ పై చూపించిన అభిమానం, గౌరవం ఇప్పుడు తనపై కూడా చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు షర్మిల!