పాకిస్తాన్ ప్రధాని గొప్పలు.. భారత్ ను ఓడించే సత్తా ఉందా?

బహిరంగ సభల్లో అత్యుత్సాహంతో ప్రసంగిస్తారనే పేరున్న పాక్ ప్రధాని ఈ సారి భారత్ పై పైచేయి సాధిస్తానంటూ కబుర్లు చెప్పి విమర్శలకు గురయ్యాడు.

Update: 2025-02-25 06:50 GMT

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పగటి కలలు కంటున్నాడు. ఇప్పటికే సవాలక్ష అంతర్గత సమస్యలతో కునారిల్లుతున్న పాకిస్థాన్ ను సంస్కరించలేని షెహబాచ్.. భారత్ ను ఓడిస్తానంటూ ప్రగల్బాలు పలుకుతున్నాడు. బహిరంగ సభల్లో అత్యుత్సాహంతో ప్రసంగిస్తారనే పేరున్న పాక్ ప్రధాని ఈ సారి భారత్ పై పైచేయి సాధిస్తానంటూ కబుర్లు చెప్పి విమర్శలకు గురయ్యాడు.

భారత్ తో ఏ కోశానా పోల్చుకోలేని స్థితిలో ఉన్న పాక్ ప్రధాని పెద్ద పెద్ద కలలు కంటున్నాడు. కలలు కనండి.. నిజం చేసుకోండి అన్నట్లు ఊహకే అందని నీతులు చెబుతూ అబాసుపాలు అవుతున్నాడు. మన దేశాన్ని ఆర్థికంగా.. అభివృద్ధి పరంగా వెనక్కి నెట్టి.. పాకిస్థాన్ ను మెరుగైన స్థితికి చేరుస్తానంటున్న ప్రధాని షెబనాజ్ షరీఫ్.. అలా జరగకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసరడం అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతోంది.

పంజాబ్ ప్రావిన్స్ లో డేరా ఘాజీ ఖాన్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఉన్నట్టుండి భారత్ పై పడి ఏడవడం వైరల్ అవుతోంది. భారత్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని తన అన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఒట్టేసి మరీ చెప్పిన షెహబాజ్ మాటలను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రగతి లేకపోయినా ప్రధాని పెద్దపెద్ద వాగ్దానాలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు పిడికిలి బిగించడం, వేదికపై గెంతడం, ఛాతీపై కొట్టుకోవడం షెబనాజ్ మేనరిజం. అయితే ఈ సారి ఆయన భారత్ ను ఢీకొడతానని చెప్పడమే కొసమెరుపు. పాకిస్థాన్ పరిస్థితిని మెరుగుపరిచేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం. పరమాత్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ పాకిస్థాన్ కు ఉన్నాయంటూ దేవుడిపై భారం వేశారు. గాల్లో దీపంలా మారిన పాకిస్థాన్ పరిస్థితికి ప్రధాని షెహబాజ్ పదవీకాంక్ష కారణమనే విమర్శలు ఉన్నాయి. ఆయన పాలనలో పాకిస్థాన్ అన్నిరంగాల్లో వెనకబడింది. చివరికి ప్రజలు ఆకలికి తట్టుకోలేక కిలో గోధుమ పిండి కోసం కూడా అల్లాడిపోయే పరిస్థితికి దిగజారింది. మరోవైపు ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అంతర్గత భద్రతకే సవాల్ విసురుతున్నారు. ఇన్ని సమస్యలు పెట్టుకుని భారత్ తో పోటీ పడతానని షెహబాజ్ చెప్పుకోవడంతో నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

Tags:    

Similar News