బంగ్లా మాజీ ప్రధాని భారత్ ను వీడారా?... యూకే ఓకే చెప్పేవరకూ అక్కడేనా?

ఈ సమయంలో గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న భారత్ అప్రమత్తమైంది

Update: 2024-08-06 08:05 GMT

గతకొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులు సోమవారం తీవ్రరూపం దాల్చడంతో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఈ సమయంలో గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న భారత్ అప్రమత్తమైంది. ఈ సమయంలో ఆమె భారత్ కు వస్తున్నారని తెలిసి, మన భద్రతా దళాలు ఎలర్ట్ అయ్యాయి.

ఈ సమయంలో బంగ్లా నుంచి సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ విమానం వస్తున్నట్లు భారత భద్రతా బలగాలు గమనించాయి. ఆ విమానంలో ఎవరు ఉన్నారో ముందే పసిగట్టిన అధికారులు.. ఆ విమానం భారత్ లోకి అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో.. రఫేల్ యుద్ధ విమానాలు బంగ్లా నుంచి వస్తున్న విమానానికి రక్షణగా బయలుదేరాయి.

అనంతరం ఉత్తరప్రదేశ్ లోని హిండన్ ఎయిర్ పోర్ట్ లో బంగ్లా నుంచి వచ్చిన విమానం దిగే వరకూ భద్రతా ఏజెన్సీలు ఆ విమానాన్ని నిరంతరం పర్యవేక్షించాయి. ఆ విమానంలో భారత్ కు వచ్చింది షేక్ హసీనా కాగా.. ఆమె ప్రయాణించిన విమానం హిండన్ ఎయిర్ బేస్ లో సోమవారం సాయంత్రం 5:45 గంటలకు ల్యాండ్ అయ్యింది. ఆమెను జాతీయ భద్రతా సలహాదరు అజిత్ దోబాల్ ఆహ్వానించారు.

బంగ్లాదేశ్ సైనికుల అల్టిమేటం అనంతరం ఇలా సొంతదేశం నుంచి బయలుదేరి హెలీకాప్టర్ లో భారత్ కు చేరుకున్న షేక్ హసీనా తిరిగి మంగళవారం ఉదయం భారత్ నుంచి బయలుదేరి వెళ్లారా అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ఆమె లండన్ లో రాజకీయ ఆశ్రయం కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ... ఇంకా దానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వ్యూలూ యూకే ప్రభుత్వం నుంచి రాలేదని అంటున్నారు.

అయితే ఆమె బంగ్లా నుంచి భారత్ కు వచ్చిన బంగ్లాదేశ్ ఎయిర్ పోర్స్ కు చెందిన హెలీకాప్టర్ హెర్కులెస్... మంగళవారం ఉదయం వెనక్కి మళ్లిందని తెలుస్తోంది. ఈ హెలీకాప్టర్ హిండన్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ తీసుకున్నట్లు అధికారులు ధృవీకరించారని తెలుస్తోంది. అయితే... ఈ హెలీకాప్టర్ ఖాళీగానే వెళ్లిందా.. లేక, అందులో హసీనా ఉన్నారా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

మరోపక్క ఆమె అందులో ఉండి ఉంటే ఈ హెలీకాప్టర్ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ కు వెళ్లొచ్చని అంటున్నారు. అక్కడ నుంచి ఆమె తదుపరి గమ్యస్థానం నిర్ణయించబడొచ్చని చెబుతున్నారు. మరోపక్క ఈ విమానం దేశ సరిహద్దులు దాటేంత వరకూ భారత్ గట్టి భద్రతను కల్పించినట్లు చెబుతున్నారు. దీంతో... ఈ విమానంలో హసీనా ఉన్నారా? అనే సందేహాలు తెరపైకి వస్తోన్నాయి! దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది!

Tags:    

Similar News