ప్రేమకు అడ్డని .. తండ్రి, తమ్ముడిని !
తన ప్రేమకు అడ్డుపడుతున్నారని కోపంతో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక తండ్రి, సోదరుడిని అత్యంత దారుణంగా హత్యచేసింది.
తన ప్రేమకు అడ్డుపడుతున్నారని కోపంతో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక తండ్రి, సోదరుడిని అత్యంత దారుణంగా హత్యచేసింది. అనంతరం వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్‌లో దాచిపెట్టింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘాతుకానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న బాలికను రెండున్నర నెలల తర్వాత పోలీసులు హరిద్వార్‌లో అరెస్ట్ చేశారు.
ఈ దారుణహత్యలు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటు చేసుకుంది. రైల్వేలో క్లర్క్‌గా పనిచేసే రాజ్‌కుమార్ విశ్వకర్మ కుమార్తె అయిన ఈ బాలిక ముకుల్ సింగ్ (19) అనే యువకుడితో ప్రేమలో పడి గత ఏడాది అతనిలో వెళ్లిపోయింది. దీంతో అతడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. తమ ప్రేమ ఫలించాలంటే తన తండ్రిని అడ్డు తొలగించుకోవడం ఒక్కటే మార్గమని ఆ బాలిక నిర్ణయించుకుంది.
దీంతో బాలికతో పాటు ముకుల్ సింగ్ కలిసి ఇద్దరూ బాలిక తండ్రి హత్యకు పథకం వేశారు. అనుకున్నట్టుగానే బ్లేడ్‌తో కోసి రాజ్‌కుమార్‌ను హత్య చేశారు. అదే సమయంలో నిద్ర నుండి లేచిన తొమ్మిదేళ్ల బాలిక సోదరుడిని సుత్తితో కొట్టి హతమార్చారు. తర్వాత మృతదేహాలను ముక్కలుముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్‌లో ఉంచి పరారయ్యారు. కాగా, బాలిక హరిద్వార్‌లో పట్టుబడగా, ముకుల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇటీవల బెంగాల్ ఎంపీని ఇదే తరహాలో హత్య చేయడం గమనార్హం.